తురా పీక్ మేఘాలయ పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో ఉన్న తురా రేంజ్ అత్యధిక ప్రజాదరణ పొందిన శిఖరాలలో ఒకటిగా ఉంది. ఇది అద్భుతమైన కొన సముద్ర మట్టం 872 మీటర్ల ఎత్తులో పొడవుగా నిలుస్తుంది. ఇది నొక్రేక్ నేషనల్ పార్క్ ద్వారా నిర్వహించబడుతుంది.
పురాణముల ప్రకారం ఈ శిఖరం ఒకప్పుడు దేవతల నివాసంగా ఉండేది. వాస్తవానికి డ్యూరా అని పిలుస్తారు. అయితే బ్రిటీష్ వారు తురా అని తప్పుగా పిలిచారు. అప్పటి నుంచి ఈ ప్రదేశంను అదే పేరుతొ పిలుస్తున్నారు.
తురా శిఖరం నుండి బ్రహ్మపుత్రా లోయ మైదానాలు మరియు బంగ్లాదేశ్ మైదాన ప్రాంతాలు చూడవచ్చు. ఈ శిఖరం యొక్క పైభాగంలో ఒక పర్యాటక బంగళా,ఒక ప్రయోగశాల మరియు రబ్బరు తోటల పెంపకం ఉంది. స్థావరం నుండి శిఖరం పైకి ఒక ఫుట్ ట్రాక్ కూడా ఉంది. ఇది పర్వతారోహకులు మరియు అధిరోహణ చేసే వారికీ సంబంరంగా ఉంటుంది.
తురా చేరుకోవడానికి ఉత్తమ మరియు అత్యంత ఆచరణ మార్గం షిల్లాంగ్ నుండి ఒక పర్యాటక బస్సు ద్వారా ఉంది.