Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వోఖ » వాతావరణం

వోఖ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమసమయం రోజంతా ఆహ్లాదకరమైన వాతావరణ౦ ఉండి ప్రాంతాల సందర్శనకు అనువుగా ఉండే వేసవి వోఖ సందర్శనకు ఎంతో ఉత్తమమైనది

వేసవి

వేసవికాలం వేసవి నెలలలో – మార్చి నుండి మే వరకు వోఖలో సగటు పగటి ఉష్ణోగ్రత 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ కాలంలో అప్పుడప్పుడు వర్షం కురుస్తుంది. కొండలు, పర్వతపాదాలతో పోలిస్తే చాల చల్లగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం నాగాలాండ్ లోని ఇతర చాల ప్రాంతాలలానే వోఖలో వర్షాకాలం విస్తారంగా ఉండి, జూన్ నుండి అక్టోబర్ వరకు కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఆగష్టు నెలలో సాధారణంగా రాష్ట్రం లోని ఈ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు గరిష్టంగా కురుస్తాయి. దీని కారణంగా వోఖ లోతట్టు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవిస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో వోఖలో చాల చల్లగా ఉంటుంది. నవంబర్, ఫిబ్రవరి మధ్య ఉండే ఈ కాలంలో డిసెంబర్,జనవరి నెలలలో చాల చల్లగా ఉంటుంది, రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత చల్లటి గాలులను మీరు చవిచూడవచ్చు.