కవడికెరి సరస్సు సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు యల్లాపూర్ టవున్ కు 20 కి.మీ.ల దూరంలో కలదు. మాగోడ్ జలపాతాలకు 9 కి.మీ.ల దూరంలో ఉంటుంది. కవడికెరి సరస్సు సందర్శించే పర్యాటకులు చుట్టుపక్కల కల వివిధ కొండలను చూసి ఆనందించవచ్చు.
ఈ సరస్సు సమీపంలో ఒక పురాతన దుర్గా మాత దేవాలయం కలదు. ఈ ప్రాంతంలో అతి పెద్ద సీతాకోక చిలుకలు అందంగా విహరిస్తూంటాయి. ఎరుపు మరియు నలుపు రంగులు కల బుల్ బుల్ పిట్టలు తిరుగుతూంటాయి.