జునెబోటొ నాగాలాండ్ కు మద్యలో సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది. దానికి పశ్చిమాన మొకొక్ఛుంగ్, తూర్పున వోఖాలు పొరుగు జిల్లాలుగా ఉన్నాయి. జునెబోటొ అనేది ఒక జిల్లా పేరు. జునెబోటొ ను జునెబో,టో అని రెండు పదాలుగా విభజించబడింది. జునెబో అంటే కొండలపైన తెలుపు ఆకులు మరియు తీపి రసంతో చేయబడిన స్పాంజ్ లాంటి చెవులు కలిగి పుష్పించే పొద అని అర్దము. టో అంటే కొండలపైన అని అర్దము. జునెబోటొ అనేది ఒక సుమీ పదము.
ప్రజలు & సంస్కృతిజునెబోటొ సుమీ తెగ వారికీ నివాసముగా ఉంది. సుమీ తెగలో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగిన యోధులు ఉంటారు. సుమీ తెగ వారు విస్తృతమైన పాట మరియు నృత్య సంప్రదాయాలను కలిగి ఉండుట మరియు పండుగలు సమయంలో రంగుల తొడుగులతో అలంకరిస్తారు. వారి ఆచార యుద్ధంలో దుస్తులు చూడటానికి కనులకు ఇంపుగా ఉంటాయి. సుమీ తెగ వారికీ ప్రతి సంవత్సరం జూలై మధ్యలో వచ్చే తులుని పండుగ అతి ముఖ్యమైన పండుగ. అలాగే ఆహున అనే పండుగ కూడా జునెబోటొ లో సుమీలు జరుపుకొనే మరొక ముఖ్యమైన పండుగ.
జునెబోటొ లో సందర్శనీయ స్థలాలు
జునెబోటొ లో పక్షి అభయారణ్యం మరియు విస్తారమైన అటవీ ప్రాంతంనకు ప్రసిద్ధి చెందింది. నాగాలాండ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణం యొక్క ఉప విభాగం జునెబోటొ లోని లుమామి గ్రామంలో ఉన్నది. జునెబోటొ జిల్లాలోనే కాకుండా పట్టణం మరియు చాలా గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారు. వ్యవసాయం ఇక్కడ ప్రజలకు ప్రధాన జీవనాధారంగా ఉంది.