Search
  • Follow NativePlanet
Share

అగుంబే - నాగుపాముల రాజధాని

33

మహాకవి కువెంపు స్వంత పట్టణం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. ఇది మల్నాడు ప్రాంతం క్రింద వస్తుంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది.  అగుంబే గురించిన కొన్ని ప్రాధమిక అంశాలు

ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. అగుంబేలో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి స్టేషన్ కలదు. ఔషధ మొక్కలకు ఇది ఒక రక్షిత స్ధావరం. ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం కనుక దేశంలోని వివిధ ప్రాంతాలనుండి పర్యాటకులు వచ్చి విశ్రాంతి పొందుతారు. ఈ ప్రాంతంలో అందమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి.

3 చ.కి.మీల విస్తీర్ణంలో ఉన్న అగుంబే ప్రదేశంలో షుమారు 500 కంటే కూడా జనాభా మాత్రమే ఉంటుంది. వీరి జీవనాధారం అక్కడి అటవీ ఉత్పత్తులు మరియు పోక చెట్ల సాగు. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. ఎన్నో అటవీ జంతువులు చూడవచ్చు. అతి పెద్ద విషనాగులకు అగుంబే ప్రాంతం నిలయంగా ఉంది.   అగుంబే సందర్శనలో పర్యాటకులు బర్కానా మరియు కుంచికల్, ఒనకే అబ్బి ఫాల్స్ మరియు జోగిగుండి మరియు కూడ్లు తీర్ధ జలపాతాలు  జలపాతాలు కూడా చూడవచ్చు. ఈ ప్రదేశానికి రోడ్డు మరియు రైలు మార్గం కలదు. సమీప రైలు జంక్షన్ ఉడిపి. పర్యాటకులకు రుచికరమైన  స్ధానిక వంటకాలు లభిస్తాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకుల బసకు ఇనస్పెక్షన్ బంగళా మరియు గెస్ట్ హౌస్ లు చౌక ధరలలో లభిస్తాయి.

అగుంబే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అగుంబే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అగుంబే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అగుంబే

  • రోడ్డు ప్రయాణం
    బస్సు ప్రయాణం - బెంగుళూరు నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను నడుపుతోంది. పర్యాటకులు షిమోగా, ఉడుపి, మంగుళూరు లనుండి కూడా బస్సులలో 40 నిమిషాల వ్యవధిలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - అగుంబే కు రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ కొంకణ్ రైల్వే లోని ఉడుపి మాత్రమే. ఇది 53 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి పర్యాటకులు స్ధానిక బస్సులను లేదా క్యాబ్ లను తీసుకొని అగుంబే చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అగుంబే ప్రదేశానికి ఎలా చేరాలి? విమాన ప్రయాణం - అగుంబే కు సమీప విమానాశ్రయం మంగుళూరు లోని బాజ్ పే విమానాశ్రయం. ఇది 93 కి.మీ. దూరంలో ఉంది. విదేశాలనుండి, ఇండియాలోని ప్రధాన నగరాలనుండి విమానాలు ఇతర మార్గాల ద్వారా అనుసంధానించబడ్డాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat