Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఐజావాల్ » వాతావరణం

ఐజావాల్ వాతావరణం

వేసవి

వేసవి మిజోరం లో వేసవులు సౌకర్యా వంతంగానే వుంటాయి. అధిక వేడి వుండదు. గాలిలో ఈ సమయంలో కూడా తేమ అధికం. మార్చ్ నుండి జూన్ వరకూ వుండే ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 29 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఈ ప్రదేశ అందాలు చూసేందుకు వేసవి అనుకూల సమయం.

వర్షాకాలం

వర్షాకాలం ఐజవాల్ లో వర్షాకాలం ఆలస్యంగా మే లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. అధిక వర్షాలు పడతాయి. ఏడాదికి సగటున 254 సెం. మీ. ల వర్షపాతం నమోదవుతుంది. ఐజవాల్ పట్టణం లోని ప్రతి సంవత్సరం 208 సెం. ల వర్షం పడుతుంది. ఈ కాలంలో రోడ్లు సరిగా వుండవు కనుఇక పర్యటనకు సూచించ దగినది కాడి.  

చలికాలం

శీతాకాలం ఇక్కడి శీతాకాలాలు అధిక చలి కలిగి వుండవు. శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఐజవాల్ లో అతి తక్కువ ఉష్ణోగ్రత 7 డిగ్రీలు గా నమోదవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుంటుంది. వింటర్ లో సందర్శించే వారికి ఉన్ని దుస్తులు సూచించ డ మైనది.