జూన్-సెప్టెంబర్ మధ్య కాలం ఆల్చి ని సందర్సిన్చ టానికి అనువైనది. పగటి ఉష్ణొగ్రతలు గరిష్టంగా 25 డిగ్రీ సెల్సియస్,కనిష్టం గా 12 డిగ్రీల సెల్సియస్ ఉండటం వల్ల యాత్రికులకి వాతావరణం సౌకర్యంగా ఉంటుంది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలం రుతుపవనాల కాలం. యాత్రికులు వర్షాలకి సన్నధ్హమైవచ్చినట్లయితే ఈ కాలం కూడా ఆల్చీని సందర్శించడానికి అనువైనదే.
ఆల్చీ లో వాతావరణ పరిస్థితులు శీతాకాలం లో గడ్డే కట్టే చలితో ఉండి,వేసవి లో ఆహ్లాదం గా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు వేసవిలో బాగా పడిపోయి, శీతాకాలం లో కనిష్టానికి చేరుకుని అసౌకర్యం కల్గిస్తాయి. వేసవి కాలం-ఏప్రిల్-జూన్ మధ్య ఇక్కడ వేసవి కాలం. వేసవి కాలం లో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పగటి ఉష్ణొగ్రతలు గరిష్టంగా 25 డిగ్రీ సెల్సియస్,రాత్రి పూట కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. కానీ ఇక్కడ వేసవి కాలం లో సూర్యరశ్మి కి ఎక్కువ గా "ఎక్స్పోస్" అవుతాము. యాత్రికులు ఎక్కువగా వేసవి కాలం లోనే ఆల్చీని సందర్శించడానికి వస్తారు.
వర్షా కాలంజూలై సెప్టెంబర్ మధ్య ఆల్చీ లో సాధారణ వర్షాలు నమోదవుతాయి.ఇక్కడ వర్షాకాలం దాదాపు సంవత్సరం పొడుగునా ఉంటుంది.గరిష్ట వర్షపాతం ఆగస్టు నెలలో నమోదవుతుంది. ఈ కాలం లో ఉష్ణొగ్రత స్థిరంగా ఉండటం వల్ల యాత్రికులు ఎక్కువగా ఆల్చీని సందర్శిస్తారు.
శీతాకాలంఆల్చీ లో శీతాకాలం లో గడ్డకట్టే చలి ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలకి పడిపోవటం వల్ల శీతాకాలం అసౌకర్యం గా ఉంటుంది. ఇక్కడ శీతాకాలం లో గరిష్టంగా 7 డిగ్రీల ఉష్ణొగ్రత నమోదవుతుంది.అందువల్ల యాత్రికులు శీతా కాలంలో ఆల్చిని సందర్శించకపోవటమే మంచిది.