Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అలహాబాద్

అలహాబాద్ - ఒక ప్రధాన యాత్రా కేంద్రం !

40

అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అనేక కోణాలు కలిగిన నగరంగా చెప్పవచ్చు. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం యొక్క అంతిమ గమ్యాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పూర్వం ఈ నగరంను వేదాలు మరియు పురాణాలు,రామాయణ మరియు మహాభారత గ్రంధములలో ప్రయాగ అని పిలిచేవారని చెప్పబడింది.

అలహాబాద్ చరిత్ర

మొఘల్ చక్రవర్తి అక్బర్ 1575 వ సంవత్సరంలో ఈ నగరమునకు ల్లహబాస్ అనే పేరును నామకరణం చేసేను. ఆ తర్వాత కాలంలో అలహాబాద్ గా గుర్తింపు పొందింది. అక్బర్ ఉత్తర భారతదేశంలో ఒక జలమార్గం,దాని ప్రాముఖ్యతను గుర్తించి పవిత్ర సంగం ఒడ్డున ఒక అద్భుతమైన కోటను నిర్మించెను. కొన్ని దశాబ్దాల తర్వాత అలహాబాద్ మరోసారి బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటంలో ప్రధాన ప్రదేశంగా ఉన్నది. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ ను1885 వ సంవత్సరంలోఅలహాబాద్ లో ప్రారంబించారు. మహాత్మా గాంధీ 1920 లో తన అహింస ఉద్యమమును కూడా ఇక్కడే ప్రారంభించారు. బ్రిటిష్ కాలంలో అలహాబాద్ ఉత్తర పాశ్చాత్య ప్రాంతాల ప్రధాన కార్యాలయంగా కూడా ఉంది. ఈ నిర్దిష్ట తరానికి బాగా సంరక్షించబడిన ముయిర్ కాలేజ్ మరియు సెయింట్స్ కేథడ్రల్ ఉన్నాయి.

అలహాబాద్ ఒక తీర్థయాత్ర సెంటర్

ఏమైనప్పటికీ అలహాబాద్ నేడు బాగా తెలిసిన మరియు హిందువులు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా పూజిస్తున్నారు. పురాణం ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన లార్డ్ బ్రహ్మ ప్రక్రిష్ట యజ్ఞం కొరకు ఈ అలహాబాద్ ను ఎంచుకున్నారు. ఆయన ఈ స్థలం యొక్క పవిత్రతకు అనుగుణంగా దీనికి 'తీర్థం రాజ్' లేదా అన్ని యాత్రా ప్రదేశాలలో రాజు అని పేరు పెట్టారు.

అలహాబాద్'సంగం'లేదా గంగా,యమునా మరియు సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమం. భారతదేశం నుండి ప్రజలు ఈ సంగం లేదా సంగమం నదులలో ఒక పవిత్ర స్నానం ఆచరిస్తారు. పవిత్రమైన సమయంలో వచ్చే మహా కుంభ మేళ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

అలహాబాద్ లో కుంభమేళా

పూర్ణ కుంభమేళా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది. 2001లో జరిగిన చివరి మహా కుంభ మేళా కు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

అంతేకాకుండా అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ కుంభమేళా సమయంలో అత్యంత చల్లదనము ఉన్న పవిత్ర జలాలలో స్నానం చేయుట వల్ల పాపాల నుండి విముక్తి కలుగుతుందని బావిస్తారు. వార్షిక మాఘ్ మేళా కూడా జనవరి నెలలో సంగం ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలహాబాద్ ను కుంభమేళా సమయంలో అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు.

అలహాబాద్ భారతదేశం యొక్క మత,సాంస్కృతిక మరియు చారిత్రిక మౌలిక లక్షణాలు నిర్వచించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అంతే కాకుండా మహాదేవి వర్మ,హరివంశ్ రాయ్ బచ్చన్,మోతిలాల్ నెహ్రూ,జవహర్ లాల్ నెహ్రూ,మురళీ మనోహర్ జోషి తో సహా ప్రసిద్ధి చెందిన అనేక మంది ప్రముఖులు జన్మించేరు. ఎలాంటి సందేహం లేకుండా అలహాబాద్ పర్యాటకం మతం,సంస్కృతి మరియు చరిత్ర యొక్క ఛాయలను కలిగి ఉంది.

అలహాబాద్ చుట్టూ పర్యాటక స్థలాలు

అలహాబాద్ లో పర్యాటక ప్రదేశాలుగా దేవాలయాలు,కోటలు,విశ్వవిద్యాలయాలు మరియు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ పాటల్పురి ఆలయం,హనుమాన్ టెంపుల్,బడే హనుమంతుని ఆలయం,శివకోటి మహదేవ్ ఆలయం,అలోపీ దేవి ఆలయం,కళ్యాణి దేవి ఆలయం,మనకామేశ్వర్ ఆలయం,నగ్వాసుకి ఆలయం మరియు బెనిమధవ్ ఆలయంతో సహా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఆనంద్ భవన్ అనేది భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో రాజకీయ నాయకులకు ప్రధాన కేంద్రంగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ పూర్వీకుల గృహమును సందర్శించండి. ఇంకా నగరంలో అలహాబాద్ కోట,మింటో పార్క్ మరియు అల్ఫ్రెడ్ పార్క్,నగరంలో అతిపెద్ద హరిత ప్రదేశాలలో ఒకటైన థోర్న్హిల్ మైనే మెమోరియల్ మరియు ఖుస్రో బాగ్,ఒక కుడ్య మొఘల్ గార్డెన్తో సహా బ్రిటిష్ మరియు మొఘల్ శకంలో మిగిలిన అనేక అవశేషాలను కలిగి ఉంది.

అలహాబాద్ లో ఇంకా చదువుకోవటానికి మరియు నేర్చుకోవడానికి భారతదేశం యొక్క ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా ఉంది. అలహాబాద్ విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన ఆంగ్ల భాష విశ్వవిద్యాలయాలలో ఒకటి. విశ్వవిద్యాలయం సర్ విలియం ముయిర్ చే ప్రారంభించబడినది. నగరంలో ఇంకా అతని పేరుతో ఒక కళాశాల ముయిర్ కాలేజ్ గా ఉంది. ఎవింగ్ క్రిస్టియన్ కాలేజ్ చదువు కోవటానికి మరొక ప్రతిష్టాత్మక కేంద్రంగా ఉంది. నగరంలో అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ కూడా ఉంది.

అలహాబాద్ లో మీరు సౌర వ్యవస్థ మరియు నక్షత్రాలు చూడగలిగేలా జవహర్ ప్లాన్టోరియం ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటగా అలహాబాద్ హైకోర్టు స్థాపించబడింది.

అలహాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలహాబాద్ వాతావరణం

అలహాబాద్
21oC / 70oF
 • Haze
 • Wind: ESE 0 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలహాబాద్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అలహాబాద్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం అలహాబాద్ జాతీయ రహదారులు 2 మరియు 27 సేవలు అందిస్తున్నాయి.సమీపంలోని పట్టణాలు మరియు నగరాలు నుండి అనేక బస్సులు బయిలుదేరుతాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం అలహాబాద్ నుండి ఢిల్లీ,కోలకతా మరియు ముంబై వంటి ప్రధాన మార్గాలకు రైలు సేవలు ఉన్నాయి. నగరంలో నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు దరగంగ్,ప్రయాగ,రమ్బఘ్ మరియు అలహాబాద్ జంక్షన్ లుగా ఉన్నాయి. మరొక జంక్షన్,ప్రయాగ ఘాట్ ప్రధాన మత సంబంధమైన పండుగల సమయంలో ప్రయాణీకుల ట్రాఫిక్ ఎదుర్కోవటానికి ఉపయోగిస్తారు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం అలహాబాద్ విమానాశ్రయంను బంరులి ఫీల్డ్ అని అంటారు. దీని సమీప అంతర్జాతీయ విమానాశ్రయం డిల్లీలో ఉంది. అయితే అలహాబాద్ కు తప్పనిసరిగా ప్రతి రోజు ఢిల్లీ నుండి కాన్పూర్ మీదుగా ఒక వాణిజ్య విమానం ఉంది. వారణాసి లేదా లక్నోలకు విమాన రాకపోకలు ఉన్నాయి. ఇక్కడ నుండి నగరంను బస్సు లేదా రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

అలహాబాద్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Jan,Mon
Check Out
22 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
 • Today
  Allahabad
  21 OC
  70 OF
  UV Index: 6
  Haze
 • Tomorrow
  Allahabad
  15 OC
  60 OF
  UV Index: 6
  Moderate or heavy rain shower
 • Day After
  Allahabad
  15 OC
  59 OF
  UV Index: 6
  Patchy light rain with thunder