Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అలెప్పి

అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్

77

అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న సృజనాత్మకతని బయటకి తీసి వారి ఉహాశక్తి లో ని విభిన్న కోణాలను ఉత్తేజపరుస్తాయి. కేరళ ప్రణాళికలో మొదటి పట్టణమైన అలిప్పి జలమార్గాలలో పర్యాటకుల ప్రయాణించే సౌకర్యాలతో అందంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా రూపుదిద్దుకుంది.

అద్భుతమైన బ్యాక్ వాటర్స్ సౌందర్యాన్ని, ఆశ్చర్యచకితుల్ని చేసే ప్రకృతి యొక్క వైభవాన్ని పర్యాటకులు మనఃస్పూర్తిగా అభినందిస్తారు. బీచ్ లు, సరస్సులు మరియు ఎన్నో గొప్ప ప్రశంసలు అందుకున్న హౌస్ బోటు లు పర్యాటకులని విశేషంగా అలరిస్తాయి.

ఆకర్షించే అలెప్పి బోటు రేస్

అలెప్పి లో ప్రతి సంవత్సరం నిర్వహించబడే నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ కి వివిధ ప్రాంతాలలో ఉన్న ఎన్నో బోటు క్లబ్స్ నుండిపాల్గొనడానికి ఉత్సుకత చూపిస్తారు. జవహర్ లాల్ నెహ్రు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గెలుపొందిన జట్టుకి రోలింగ్ ట్రోఫీ ని బహుకరించే పద్దతిని ప్రారంభించారని అంటారు. బోటు ప్రయాణం లో ని అమితమైన ఆనందాన్ని పొందిన నెహ్రు గారు, వారి కృషిని గుర్తించేందుకు ఈ పోటిలని ప్రారంభించారు. మొదటగా నిలిచిన జట్టుయొక్క శక్తి యుక్తులని ప్రోత్సహిస్తూ ఈ ట్రోఫీ ని అందచేస్తారు. ఈ పోటీలు ప్రారంభమై అరవై సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అదే ఉత్సాహం కొనసాగుతోంది. ప్రశాంత మైన నీళ్ళని ఉత్తేజపరిచి, ఆనందోత్సాహాలతో నగరాన్ని చుట్టుముట్టే ఈ పోటీలు ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో రెండో శనివారం జరుగుతాయి. జూన్ జూలై ల లో నమోదయ్యే భారీ వర్ష పాతాలు ముగియడం వల్ల ఈ సమయం కేరళ ని సందర్శించేందుకు ఉత్తమం.

పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం

ఈ ప్రాంతం లో కి అడుగిడడం ద్వారా ప్రకృతి యొక్క అందాలని ఆస్వాదించేందుకు, లౌకిక అలౌకిక అనుభవాలని సొంతం చేసుకునేందుకు ఆహ్వానం అందుకున్నట్టు చెప్పుకోవచ్చు. దేవుని సందర్సన ద్వారా ఆధ్యాత్మిక అనుభవాల ని విస్తరింపచేసే ఆలోచన కలిగిన పర్యాటకులకు ఈ ప్రాంతం నిరుత్సాహపరచదు. అమ్బలపుజ్హ శ్రీ కృష్ణ టెంపుల్, ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్, చేట్టికులంగర భగవతి టెంపుల్, మన్నరసల శ్రీ నాగరాజా టెంపుల్ మరియు ఎదతు చర్చ్, సెయింట్ ఆండ్రూస్ చర్చ్, సెయింట్ సెబాస్టియన్స్ చర్చ్, చంపకులం చర్చ్ వంటి ప్రాచుర్యం పొందిన వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో క్రైస్తవమత విస్తరణ కై సెయింట్ థామస్ సందర్శించిన ప్రదేశాలలో అలెప్పి ఒకటి. బౌద్దమతం యొక్క రాకతో మిగిలిన వాటిని సంరక్షించే కేరళ ప్రయత్నాన్ని మెచ్చుకొనక ఆగలేము. బుద్దుడి కాలం నుండే ఈ మతం కేరళలో తన ప్రభావాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించింది. ఈ మతం యొక్క గత వైభావాలకి సంబంధించిన వి ఏమీ కనుపడక పోయినా అలెప్పి నగరంలో జాగ్రత్తగా సంరక్షింపబడుతున్న బుద్ధుడి విగ్రహం( కరుమది కుట్టాన్) నుండి కొంత మేరకు సంగ్రహావలోకనం చేసుకోవచ్చు.

కనువిందు చేసే రంగులమయం ఇక్కడి ప్రకృతి సౌందర్యం

అల్లెప్పి లో పతిరమన్నాల్ తప్పక సందర్శించవలసిన ప్రాంతం. బ్రోచర్ ల లో కూడా ఈ ద్వీపం గురించి వర్ణించలేనంత అందం ఈ ప్రాంతం సొంతం. విభిన్న జాతుల అరుదైన వలస పక్షులకి స్థావరం పతిరమన్నాల్. కేరళలో ని మిగతా ప్రాంత సందర్శన ల ని మించిన అనుభూతి ఈ పతిరమన్నాల్ పర్యటన అందిస్తుంది. వెంబనాడ్ సరస్సుపైన ఉన్న మనితప్పుర ద్వీపం నుండి కనిపించే అలెప్పి లో ని అద్బుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఆశ్చర్యానుభుతులలో చిక్కుకుపోయి 'రైస్ బౌల్ అఫ్ కేరళ' ని సందర్శించడం పర్యాటకులు మర్చిపోకూడదు. ఈ గ్రామీణ ప్రాంతం లో ఉండే ఆకుపచ్చని పంట పొలాలు, విస్తారం గా పండే వరి పొలాలు వంటివి సందర్శించడం ద్వారా దేవుని యొక్క స్వంత ప్రదేశం అనబడే ఈ కేరళ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి.

అలెప్పి ని ఎప్పుడు సందర్సించాలి?

నవెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అలెప్పి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. అలెప్పి కి రైలు, బస్సు లేదా వాయు మార్గం ద్వారా చేరే సదుపాయం కలదు. ఈ నగరంలో విమానాశ్రయం లేనందువల్ల సమీపంలో ఉన్న కొచ్చి విమానాశ్రయాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. దేశంలో ని ఎన్నో ప్రధాన నగరాల నుండి ఈ ప్రాంతానికి రైళ్ళు, బస్సులు అందుబాటులో కలవు. ఈ ప్రాంతానికి తగిలే జాతీయ రహదారి ద్వారా రాష్ట్రం లో ని వివిధ నగరాలకి రాకపోకలు సులువుగా జరుగుతాయి.

ఇతిహాసాలు, పురాణాలూ, కథలు

రాజులు రాణుల కాలానికి సంబంధించిన చారిత్రక ఇతిహాసాలు, అందమైన కథలు తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగిన పర్యాటకులు ఖచ్చితంగా పాండవన్ రాక్ మరియు కృష్ణాపురం పాలస్ ని సందర్శించి తీరవలసిందే. 'పాండవులు ' నుండి పాండవన్ రాక్ అనే పేరు వచ్చింది. రాజ్యం నుండి పాండవులు బహిష్కరింపబడిన తర్వాత పాండవులు ఒక గుహలో ఆశ్రయం పొందారని నమ్మకం. ఈ విషయాల పై ఆసక్తి కలిగిన వారు తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది. పురాణ వృత్తాంతాలకి ఈ కృష్ణాపురం పాలస్ ఒక వేదిక. ఈ పాలస్ లో త్రావనోర్ ని పాలించిన అనిజ్హం తిరునల్ మార్తాండ వర్మ నివసించేవారు. 18 వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ పాలస్ ని ఆ తరువాత ఎన్నో సార్లు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ పాలస్ యొక్క సంరక్షణ కేరళ పురావస్తు శాఖ తీసుకుంది.

అలెప్పి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలెప్పి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలెప్పి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అలెప్పి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బెంగుళూరు, ట్రివెండ్రం, ముంబై, కోయంబత్తూర్, కన్నూర్, కోజ్హికోడ్, కొచ్చి వంటి కొన్ని ప్రాంతాల నుండి అలెప్పి కి బస్సు సర్వీసులు కలవు. ప్రైవేటు మరియు గవర్నమెంటు బస్సులు ఈ సేవలని అందిస్తాయి. ఇది కొంచెం ఖర్చు తో కూడుకున్న అంశం. అంతే కాకుండా, ఇటువంటి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం భారత దేశం లోని రైళ్ళ ద్వారా అలెప్పి ప్రాంతం అనుసంధానమై ఉంది. వివిధ ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, బెంగుళూరు నగరాల నుండి ఈ ప్రాంతానికి రైళ్ళ రాకపోకలు ప్రతి రోజు ఉంటాయి. బెంగుళూరు మరియు చెన్నై నుండి ఇక్కడికి చేరుకోవడానికి సగటుగా 12 గంటల సమయం పడుతుంది. ముంబై నుండి అలెప్పి కి చేరుకునేందుకు 36 గంటల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం అలెప్పి లో విమానాశ్రయం లేదు. అలెప్పి కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రివెండ్రుం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు 84 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొచ్చిన్ విమానాశ్రయం సమీపంలో ఉన్న విమానాశ్రయాలు. ఈ విమానాశ్రయాల నుండి టాక్సీ మరియు బస్సులు అందుబాటులో కలవు. దేశ విదేశాల కు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయాలు, కేరళ లో ఉన్న ప్రధాన విమానాశ్రయాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat