Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమర్ నాథ్ » వాతావరణం

అమర్ నాథ్ వాతావరణం

అత్యుత్తమ కాలం: అమర్ నాథ్ ని సందర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్య కాలం అనువైనదిగా భావించబడుతుంది. ఇక్కడి వేసవులు ఆహ్లాదంగా, శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి. అమర్ నాథ్ యాత్రకు అత్యధిక సంఖ్య లో భక్తులు మే నుంచి అక్టోబర్ మధ్య కాలం లో వస్తారు. ఈ ప్రదేశం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలం లో మంచు భారీగా కురవటం వల్ల విపరీతమైన చల్లగా ఉంటుంది. ప్రయాణీకులు సాధారణంగా ఈ సమయం లో ఇక్కడికి రారు.

వేసవి

వాతావరణంఅధిక ఎత్తులో ఉండటం వల్ల, అమర్ నాథ్ లోని వాతావరణం తరచూ మారుతూ ఉంటుంది. సంవత్సరంలో చాలా నెలలు మంచు తో నిండి ఉంటుంది. ఈ ప్రదేశం లోని సరాసరి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలు ఉంటుంది. అమర్ నాథ్ కు వచ్చే యాత్రికులకు ఎలాంటి వాతావరణానికైనా సంసిద్ధులై ఉండాలి. శీతాకాలం లో ఇక్కడ భారీ హిమ పాతం వల్ల, ఉష్ణోగ్రతలు గడ్డ కట్టే స్థాయి కి పడిపోతాయి. వార్షిక అమర్ నాథ్ యాత్ర సాధారణంగా వేసవి కాలం లో నిర్వహించబడుతుంది.వేసవి కాలం ( మే నుంచి అక్టోబర్): అమర్ నాథ్ లోని వాతావరణం,వేసవి కాలం లో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది లో ఈ కాలంలో సరాసరి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలు ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

వర్షాకాలం

వర్షా కాలం ( ఏడాది లో ఎప్పుడైనా): అమర్ నాథ్ లోని వర్షాలు అనుహ్య౦గా ఉంటాయి.సంవత్సరం లో ఏ సమయంలో అయినా వర్షం పడవచ్చు. ఈ కాలం లోని జారే దారులు ప్రయాణీకులువంపుల బాటలు ఎక్కడాన్ని మరింత జటిలం చేస్తుంది. వర్షా కాలం లో ఈ ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు జాగ్రత్త వచించాలి.

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుంచి ఏప్రిల్): అమర్ నాథ్ లో శీతాకాలం చల్లగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 వరకు పడిపోయే అవకాశం ఉంది. యాత్రికులు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడి హిమపాతాన్ని చూడటానికి వస్తారు.