Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అంబీ వేలీ

అంబీ వేలీ - ఒక ప్రత్యేక ప్రదేశం

7

అంబీ వేలీ ప్రధానంగా సహారా గ్రూప్ వారు ఏర్పరచినది. ఈ ప్రణాళిక వారు ఏర్పరచినది మొదలు దాని నిర్వహణపై ఎన్నో సంశయాలు తలెత్తాయి. అంబీ వేలీ పెట్టుబడులు కూడా ప్రశ్నార్ధకంగా మారాయి. కాని వారాంతపు సెలవుల విషయంలో ఈ ప్రదేశం విజయవంతమైంది.

అంబీ వేలీ ఇండోర్ మరియు అవుట్ డోర్ వినోద క్రీడలు కల ఒక రిసార్టు. సుమారు 10,000 ఎకరాలలో చక్కటి వసతులతో స్ధాపించబడిది. వారాంతపు సెలవులలో వినోదం కొరకు 30 నిమిషాలలో చేరవచ్చు. కోట్లాది రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టిన ధనికులకు ఇది మంచి వినోద ప్రదేశంగా ఉంది. ప్రత్యేక ఛార్టర్ విమానంలో అక్కడ కల 1.5 కి.మీ.ల స్వంత మార్గంలో తేలికగా ప్రయాణం చేయవచ్చు.

 వయసుతో నిమిత్తం లేకుండా....

కొద్ది సంవత్సరాల క్రిందటి వరకు అంబీ వేలీ ప్రయివేట్ వ్యవహారాలకే వాడబడింది. అయితే, ఇటీవలి అభివృధ్ధితో సాధారణ ప్రజలకు కూడా అంబీ వేలీ చేరువయింది. దీనిలో 7 నక్షత్రాల హోటళ్ళు కలవు. 18 రంధ్రాల పూర్తి గోల్ఫ్ కోర్సు కలదు. పిల్లల విభాగం మరియు వాటర్ పార్క్ వంటివి అన్ని వయసుల వారికి ఆనందాన్ని అందిస్తాయి. పార్టీలు చేసుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. నైట్ క్లబ్ లు, డిస్కోధిక్ వంటివి కూడా కలవు.

మనుష్య నిర్మాణాలు ప్రకృతి సౌందర్యంతో కలబోసి అద్భుత ప్రదేశంగా తీర్చి దిద్దారు. అందమైన మరియు ఎత్తైన సుందర ప్రదేశాలు , సహజ మరియు మానవ నిర్మిత సరస్సులు. 25 కి.మీ.ల పొడవైన నీటి సరస్సు సముద్ర మట్టానికి 2300 అడుగుల ఎత్తున ఏర్పరచారు.

ఇక్కడకల బీచ్ పిల్లలకు, పెద్దలకు ఆనందం కలిగిస్తుంది. ప్రత్యేకించి వేసవి మధ్యాహ్నాలు మరింత ఆనందం కలిగిస్తాయి. అంబీ వేలీ సిటీ చాలా పెద్దది. కొన్ని మార్లు దోవ కూడా మరుస్తారు. అటువంటపుడు భయపడకండి. రీసెప్షన్ సిబ్బంది ని సంప్రదిస్తే చాలు మిమ్ములను వారు ఆదుకుంటారు.

ఈ వ్యాలీ లోని పెట్టుబడి దారునుండి వారాంతపు సెలవులకు వెళ్ళే పర్యాటకుడి వరకు కావలసిన రీతిలో అనేక రకాల వసతులు కలవు. బయటి గుడారాలు కూడా అద్దెకు తీసుకోవచ్చు. 24 గంటల సేవలుంటాయి. సింగిల్ రూము, రెండు బెడ్ రూముల వసతి మరియు విల్లా వంటి అనేక ప్రమాణాలలో వసతులు కలవు.

వసతుల లోపలి భాగాలు అలంకరణలు బయటి ప్రకృతి సౌందర్యానికి అనుగుణంగా చేయబడ్డాయి. . ఓపెన్ టు స్కై బాత్ రూములు, జక్కుజీలు, , పర్వతాలు మరియు సరస్సులు కనపడే విధంగా సన్ డెక్ లు నిర్మించారు.

ఈ ఏర్పాట్లలో భారతీయ మరియు యూరప్ సౌకర్యాలు రెండూ అందుబాటులో ఉంటాయి. వీటి నిర్వహణ ఎంతో సమర్ధవంతంగా ఉంటుంది.

మీరు క్రీడా ప్రియులైతే, అంబీ వేలీ మీకు ఎన్నో రకాల క్రీడలనందిస్తుంది. హా్ర్స్ రైడింగ్, గోల్ఫ్, మొదలైనవి కలవు. అంతేకాదు ఈ క్రీడలలో మీకు వారు శిక్షణ కూడా ఇస్తారు. సుమారు 10,000 ఎకరాలలో చేసిన ఈ ఏర్పాట్లు మీకు ఆనందం కలిగిస్తాయి. ఈ వ్యాలీ అక్కడి ఉత్తమ సేవలకు తగ్గట్లుగా రుసుములు కూడా వసూలు చేయడంతో ధనిక వర్గం మాత్రం బాగా ఆనందిస్తారు. అయినప్పటికి మధ్య తరగతి వారికి సైతం అందుబాటులో నే ఉంటాయి.

అంబీ వేలీ లో ఒక జంటకు తన పిల్లవాడితో రోజుకు సుమారు 15 నుండి 20 వేల రూపాయలు ఖర్చవుతుంది. అయినప్పటికి దానికి తగ్గ విలువను పొందగలరు.

అంబీ వేలీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అంబీ వేలీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అంబీ వేలీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అంబీ వేలీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణంగా అంబీ వేలీ చేరాలంటే, పొరుగున ఉన్న ఏ నగరం నుండి అయినా సరే రోడ్డు ప్రయాణం చేయవచ్చు. ముంబై పూనే ఎక్స్ ప్రెస్ వే లేదా లోనావాలా రోడ్లు అంబీ వేలీ చేరుస్తాయి. లోనావాలా పట్టణ కేంద్రంనుండి సుమారు 30 నిమిషాలలో రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. లోనావాలా నుండి అద్దె కార్లు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    అంబీ వేలీ చేరాలంటే, ముంబై మరియు పూనా మార్గంలో కల లోనావాల స్టేషన్ దిగాలి. లోనావాల స్టేషన్ నుండి ఎక్కడికైనా సరే ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సుమారుగా రెండు మిలియన్ల రూపాయలు ఖర్చు చేయగటవారికి ఈ అంబీ వేలీ పర్యటనకు ఒక హెలికాప్టర్ కూడా వాడవచ్చు. 1.5 కి.మీ. విమాన మార్గం కలిగి బోయింగ్ 737 పాసింజర్ విమానాలను కూడా ఈ ప్రదేశం నిర్వహించగలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat