ఉదయం కేరళలో, మధ్యాహ్నం కర్నాటకలోని పుణ్యక్షేత్రాల్లో కొలువై ఉండే అమ్మవారు


చదువుల తల్లి సరస్వతి అని హిందువులు అనాదిగా నమ్ముతూ వస్తున్నారు. అందువల్లే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో సరస్వతీ దేవిని భక్తి ప్రవర్తులతో కొలుస్తారు. అటువంటి సరస్వతీ దేవి ఉదయం పూట కేరళలోని ఒక పుణ్యక్షేత్రంలో కొలువై ఉండి అక్కడి భక్తులను కరుణిస్తుంది. అటు పై మధ్యాహ్నం తర్వాత కర్నాటకలోని మరో పుణ్యక్షేత్రంలో ఉండిపోతుంది. పురాణ కాలం నుంచి ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. ఇలా ఉదయం పూట తాను కేరళలోని ఓ పుణ్యక్షేత్రంలో ఉంటానని, మధ్యాహ్నం తర్వాత కర్నాటకలోని మరో పుణ్యక్షేత్రంలో ఉంటానని సాక్షాత్తు ఆ సరస్వతీ దేవి ఆదిశంకరాచార్యులకు తెలిపిందని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube

కర్నాటకలో ఆ సరస్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతం కొల్లూరు. పచ్చని కోడచాద్రి కొండల నడుమ ఉన్న ఈ దేవాలయం ఏటా లక్షలాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
పురాణాలను అనుసరించి ఈ ప్రాంతంలో ముందు కౌమాసుర అనే పేరుగల రాక్షసుడు పాలించేవాడు. మిక్కిలి బలవంతుడైన ఆ రాక్షసుడు ఈ ప్రాంతంలోని మునులను, ప్రజలను తీవ్రంగా హింసించేవాడు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
అంతేకాకుండా తనకు చావు రాకుండా పరమేశ్వరుడి గురించి ఘోరతపస్సు చేయడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న దేవతలు అతనికి చావు రాకుండా వరం వస్తే ఈ భూ మండలం మరింత అల్లకల్లోలమవుతుందని భయపడుతారు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీంతో వారంతా కలిసి ఈ కష్టం నుంచి గట్టెక్కించాల్సిందిగా సరస్వతీ దేవిని వేడుకొంటారు. దీంతో మూకాసురుడు తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్ష మయ్యే సమయంలో అతనికి మాటలు రాకుండా చేస్తుంది.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీంతో అతను పరమేశ్వరుడిని ఏవరం కోరుకోలేక పోతాడు. అప్పటి నుంచి ఆ కౌమాసురను మూకాసుర పేరుతో పిలుస్తారు. ఇంత జరిగినా అహంకారం వీడని కౌమాసురుడు ప్రజలను హింసించడం మానలేదు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీంతో దేవతలు తిరిగి ఆ సరస్వతిని వేడుకొంటారు. దీంతో సరస్వతీ దేవి తన అంశలైన పార్వతీదేవి, లక్ష్మీ దేవితో కలిసి ఆదిపరాశక్తిగా రూపాంతరం చెందుతుంది.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
అటు పై ఆ మూకాసురుడితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తుంది. దీంతో ఆ ఆదిశక్తిని మూకాంబిక పేరుతో ఇక్కడి వారు స్తుతించి ఇక్కడే కొలువై ఉండాలని కోరుకొంటారు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
భక్తుల కోరికను మన్నించిన అమ్మవారు ఇక్కడ మూకాంబికగా కొలువై కోరిన కోర్కెలు తీర్చే దేవతగా పేరుతెచ్చుకొంటుంది. మూకాసురుడిని వధించిన స్థలం ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీనిని మరణ కట్టె అని పిలుస్తారు. ఇక ఇక్కడ పంచలోహాలతో తయారుచేసిన మూకాంబిక విగ్రహాన్ని చంద్రమౌళేశ్వర విగ్రహాన్ని శంకరాచార్యలు ప్రతిష్టించారని చెబుతారు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యుల జన్మించిన కేరళలో ఒక్క సరస్వతి దేవి ఆలయం కూడా లేకపోవడం ఆయనకు బాధకలిగిస్తుంది.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీంతో ఆ సరస్వతి దేవిని ప్రార్థించి తనతోపాటు వచ్చి కేరళలో కొలువై ఉండాలని వేడుకొంటాడు. ఇందుకు ఒక షరత్తుతో సరస్వతి దేవి అంగీకరిస్తుంది.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దాని ప్రకారం ముందు శంకరాచార్యులవారు నడుస్తుంటే వెనక సరస్వతి దేవి ఆయన్ను అనుసరిస్తుంది. కేరళ వచ్చేంత వరకూ శంకరాచార్యుల వారు వెనక్కు తిరిగి చూడకూడదు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
అయితే వారిద్దరూ ప్రస్తుతం కొల్లూరు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే సరస్వతి దేవి కాళ్ల మువ్వల శబ్ధం ఆగిపోతుంది. దీంతో సరస్వతి దేవి తనను అనుసరించడం లేదని భావించిన శంకరాచార్యలు వెనక్కు తిరుగుతాడు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
దీంతో సరస్వతి దేవి అక్కడే శిలరూపంలో నిలిచిపోతుంది. అయితే శంకరాచార్యుల వారు వేడుకోవడంతో ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాత్రం కేరళలో ఉంటానని.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
అటు పై తాను తిరిగి కొల్లూరుకు చేరుకొంటానని చెబుతుంది. ఇందుకు అంగీకరించిన శంకరాచార్యులు అమ్మవారిని కేరళలోని ఎర్నాకులం జిల్లా చొట్టునిక్కారా అనే పట్టణంలో కొలువై ఉండాల్సిందిగా వేడుకొంటాడు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
ఈ దేవాలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించారని చెబుతారు. ఇక్కడ అమ్మవారు ఉదయం పూట స్వేతవర్ణం చీరతో దర్శనమిస్తారు. ఆ సమయంలో అమ్మవారు సరస్వతి రూపంలో ఉంటారని భక్తుల నమ్మకం.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
ఇక మధ్యహ్న సమయంలో రంగురంగు పట్టువస్త్రాలను, బంగారు ఆభరణాలను ధరించి భక్తులకు లక్ష్మీ దేవి రూపంలో కనిపిస్తారు. ఇక సాయంత్రం సమయంలో నీలి రంగు చీరను ధరించి సాక్షాత్తు ఆది పరాశక్తిగా కరుణిస్తారని చెబుతారు.

కొల్లూరు మూకాంబిక దేవి

P.C: You Tube
భూత, ప్రేత బాధితులు మానసికవైకల్యం ఉన్నవారికి ఈ దేవాలయంలోని అమ్మవారిని కొలిస్తే స్వస్తత చేకూరుతుందని నమ్ముతారు.

6 నెలలు భక్తులకు, 6 నెలలు బుుషులకు ప్రవేశం కల్పించే మళ్లపంది, పాములు ఉన్న గుహాలయం

Have a great day!
Read more...

English Summary

kollur mookambika temple is ancient shrine. to know more check it here.