కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా


కొండగట్టు అంజన్నది విభిన్న రూపం ఒకవైపు నారసింహుడి మొహం ఉండగా మరోవైపు ఆంజనేయుడి మొహం ఉంటుంది. ఈయన్ను ఇక్కడ స్వయంభువుగా పేర్కొంటారు. కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడని తెలంగాణ వాసులు నమ్ముతారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. అందువల్లే మంగళ, శనివారాల్లో ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కొండగట్టు పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

కొండగట్టు అంజన్న

P.C: You Tube

తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఇది కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కేంద్రంలోని ముత్యం పేట గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
ఇది జిల్లాలోని జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
అందువల్లే ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత ఉంది. పూర్వం రామ రావణుడు యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు కొద్ది సేపు మూర్చపోతాడు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
ఆ సమయంలో సంజీవని తేవడానికి హనుమంతుడు వెలుతారు. సంజీవని మూలికలు దొరక్కపోవడంతో ఆ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పెకిలించుకొని లంకకు తిరుగు ప్రయాణమవుతాడు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
మార్గమధ్యంలో ఆ పర్వతం లోని కొంత భాగం కిందికి పడుతుంది. అలా పడిన క్షేత్రమే కొండగట్టుగా రూపాంతరం చెందిందని చెబుతారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
ఇక ఇక్కడ హనుమంతుడు నారసింహస్వామి ముఖంతో పాటు ఆంజనేయుడి ముఖం కలిగి ఉంటాడు. ఇలా రెండు ముఖాలతో ఆంజనేయస్వామి కనిపించడం భారత దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెబుతారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
అదే విధంగా విగ్రహంలో శంఖు, చక్రాలతో పాటు హ`దయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా ఇక్కడి గ్రామస్థులు చెబుతారు. అందువల్లే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
ఆ ఆవును వెదుకుతూ సొమ్మసిల్లి ఒక చెట్టు నీడన పడుకొంటాడు. కలలో ఆంజనేయస్వామి కనిపించి నేనిక్కడే కోరంద పొదలో ఉన్నానని చెబుతాడు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
అంతేకాకుండా తనకు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాలని సూచిస్తాడు. దీంతో సంజీవుడు ఉలిక్కిపడి లేచి కలలో ఆ ఆంజనేయస్వామి తెలిపిన వివరాల ప్రకారం వెదుకగా శంఖు, చక్ర, గదాలంకరణతో ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారు దర్శనమిచ్చారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
విశ్వరూపమైన పంచముఖాల్లో ఒకటైన నారసింహ స్వామి మొహం ఒకవైపు ఉండగా ఆంజనేయ స్వామి మొహం మరోవైపున ఉంది. ఇంతలో తప్పిపోయిన ఆవు ఒకటి తనంత తానుగా ఇక్కడకు పరుగెత్తుకు వచ్చింది.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
దీంతో సంతోషించిన ఆ సింగం సంజీవుడు తన పరివారంతో కలిసి చిన్న దేవాలయన్ని నిర్మించారు. అక్కడే తనకు తోచిన రీతిలో ధూప ధీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
క స్వామివారి విభిన్న రూపంతో పాటు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉండటం వల్ల ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత దేవాలయాన్ని 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ కట్టించాడు.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంది. అలాగే జగిత్యాల నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

కొండగట్టు అంజన్న

P.C: You Tube
ఈ దేవాలయం దగ్గర్లో మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు భేతాలుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు తదితర దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.

కొండగట్టు అంజన్న


P.C: You Tube
కొండ పై మూడు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. వీటికి రోజుకు రూ.250 అద్దె ఉంటుంది. మరో 30 వరకూ గదులను అద్దెకు తీసుకోవచ్చు. ఇందులో కొన్నింటికి రోజుకు రూ.50 చొప్పున వసూలు చేస్తే, మరికొన్నింటికి రూ.150 వరకూ వసూలు చేస్తారు.

బెంగళూరులో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చూడకుండే చాలా మిస్ అవుతారు.

Have a great day!
Read more...

English Summary

kondagattu anjaneya swamy temple is ancient shrine. Check out the history, timings and how to reach