ముత్తప్పన్ దేవుడు...మాంసం, మద్యం, చేపలకూరంటే ముద్దు, శునకాలన్నా కూడా


మన భారత దేశంలో దేవాలయాలకు కొదువ లేదు. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. ఇటువంటి కోవకు చెందినదే కేరళలోని ఓ దేవాయం. ఇక్కడ ప్రధాన దేవుడికి మద్యం, మాంసం, చేపలను నైవేద్యంగా పెడుతారు. ఈ దేవాలయం గర్భగుడిలోకి ఏ జాతి, ధర్మానికి చెందినవారైనా ప్రవేశించి పూజలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయం లోపలికి కుక్కలకు కూడా ప్రవేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube

కేరళలోని కణ్ణూరు జిల్లా తాలిపరంపరంబ అనే ప్రదేశం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వలపట్టణమం అనే నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
అన్నట్టు ఈ దేవాలయం పేరు ముత్తప్పన్ దేవాలయం. ఈ ముత్తప్పన్ దేవాలయాన్ని పరస్సీనికడవు ముత్తప్పన్ దేవాలయం అని కూడా పిలుస్తారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
ఇక్కడ ప్రధాన దేవత జానపద కథల్లోని దైవం. వైదిక దేవుళ్లకు ఈ ముత్తప్పన్ కు ఎుటవంటి సంబంధం లేదని చెబుతారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
అయితే ఇటీవల మాత్రం కొంతమంది ముత్తప్పన్ ఈశ్వరుడని చెబుతుండగా మరికొందరు మాత్రం విష్ణువు రూపంగా కొలుస్తున్నారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
ఈ దేవాలయంలో నైవేద్యంగా బ్రాహ్మణ విధానాలను అనుసరించరు. నైవేద్యంగా మాంసం, మద్యం, చేపల కూరను నివేదిస్తారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
ఈ దేవాలయంలో ముత్తప్పన్ తిరుముత్తప్పన్ పేరుతో జరిగే ఉత్సవం 3 రోజుల పాటు కొనసాగుతుంది. దీనిని చూడటానికి కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
ఈ ముత్తప్పన్ చరిత్ర కొంత భిన్నంగా ఉండటమే కాకుండా వినూత్నంగా ఉంటుంది. ఇది ఒక జానపద కథనం. పయ్యవూరు అనే గ్రామంలో నడువజి, పడికుట్టి అనే దంపతలు ఉంటారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
వారికి సంతానం ఉండదు. పడికుట్టి పరమ శివభక్తురాలు. ఒక రోజు నదిలో స్నానం చేస్తుంటడా పూలబుట్టెలో ఒక పిల్లవాడు ఆ ఆనదిలో తేలుతూ వస్తాడు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
శివుడు అనుగ్రహించాడని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకొని పెంచుతుంది. ఇందుకు ఆమె భర్త కూడా అంగీకరిస్తారు. పిల్లలులేని ఆ దంపతులు ముత్తప్పన్ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యేకొద్ది దళితులంటే మక్కువ చూపడం, వారి అభివ`ద్ధి కోసం పాటుపడటం చేస్తుంటాడు. అంతేకాకుండా బ్రాహ్మణులు చేసే ఏ కార్యక్రమాలను కూడా చేసేవాడు కాదు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
పైగా వేటాడటం, మాంసాన్ని తినడం చేస్తుండేవారు. ఈ విధానాలన్నీ ఆ బ్రాహ్మణ దంపతులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఇటువంటి పనులన్నీ బ్రాహ్మణుల ఇళ్లలో చేయకూడదని చెబుతారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
దీంతో ఆ పిల్లవాడు ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధపడుతాడు. అయితే కుమారుడు వెలుతుండటం చూసిన తల్లి దండ్రులు ఇంటిని, తమను వదిలి వెళ్లవద్దు అని ప్రాదేయపడుతూ ముత్తప్పన్ వెంట పడుతుంది.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
దీంతో ముత్తప్పన్ కోపంతో ఆమె తల్లిని చూస్తాడు. అంతేకాకుండా తాను దైవాంశ సంభూతుడని చెబుతూ తన మార్గానికి అడ్డు రాకూడదని కోరుతాడు. అటు పై తన నిజరూపాన్ని చూపిస్తాడు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
దీంతో దంపతులు వెనక్కు తగ్గుతారు. ఇదిలా ఉండగా ఆ ముత్తప్పన్ ను ఎల్లప్పుడూ ఒక శునకం వెంబడించేది. అందువల్లే ముత్తప్పన్ దేవాలయం ప్రవేశ ద్వారంలో రెండు శునకాలు ఉంటాయి.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
సాధారణంగా ఏ దేవాలయంలో అయినా ఏనుగులు, సింహాలు ఉండటం అన్నది హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. అందువల్లే ముత్తప్పన్ దేవాలయంలో శునకాలను దైవ సమానంగా బావిస్తారు.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
ఈ ముత్తప్పన్ దేవాలయాలు కేరళలోని కాసరగూడు కణ్ణూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మన కర్నాటకలో కూడా కూర్గ్ జిల్లాలో కూడా ముత్తప్పన్ దేవాలయం ఉంది.

ముత్తప్పన్ దేవాలయం, కేరళ

P.C: You Tube
అయితే ప్రధాన దేవాలయం కేరళోని కణ్ణూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేరళలోని పలు పట్టణాల నుంచి ఇక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా

Have a great day!
Read more...

English Summary

parassinikadavu muthappan temple folklore temple. to know more bout it read it now.