బెంగళూరులో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చూడకుండే చాలా మిస్ అవుతారు.


సమాచార సాంకేతిక రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో అనేక గణపతి దేవాలయాలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజూ ఎంతోమంది భక్తులు దర్శించుకొంటుంటారు. అయితే వినాయక చవితి సందర్భంగా కొన్ని చోట్ల ప్రత్యేక మంటపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్టింపజేసి పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా అనేక సంగీత, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

బెంగళూరు గణేష్ ఉత్సవ్, బసవనగుడి

P.C: You Tube

బెంగళూరులో వినాయక చవితి ఉత్సవాలు అన్న తక్షణం అందరి మదిలో మెదిలేది బసవన గుడిలో జరిగే బెంగళూరు గణేష్ ఉత్సవం. బెంగళూరు నగరంలో ఎక్కువ రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవం కూడా ఇదే.

ఏపీఎస్ కళాశాల ఆవరణం

P.C: You Tube

ఈ ఉత్సవం స్థానిక ఏపీఎస్ కళాశాల ఆవరణంలోని బసవన గుడిలో జరుగుతుంది. ఈ ఉత్సవం జరిగినన్ని రోజులూ సంగీత, సాహిత్య, నాట్య రంగాలతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు ఎంతో మంది ఇక్కడకు వచ్చి తమ కళా నైపుణ్యంతో భక్తులను అలరిస్తారు.

56 ఏళ్ల నుంచి

P.C: You Tube

56 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ గణేష ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న బాలసుబ్రహ్మణ్యం తన గానమాదుర్యంతో ప్రేక్షకులను ఓలలాడించనున్నారు.

108 గణేష్ ఉత్సవ్, డీవీజీ రోడ్

P.C: You Tube

బెంగళూరులోని శ్రీ వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగే ఉత్సవం కూడా చాలా ప్రాచూర్యం చెందినది. ఈ సంఘం 22 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మ్యూజికల్ నైట్స్, కామెటీ నాటికలు, జానపద న`త్యాలతో ప్రేక్షకులను మెప్పిస్తారు.

ఇనార్భిట్ మాల్

P.C: You Tube

ఎకోఫ్రెండ్లీ గణేష ఉత్సవాలను నగరంలో మొదలు పెట్టింది ఇనార్భిట్ మాల్ అని చెప్పవచ్చు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని వస్తువులతోనే ఇక్కడ గణపతిని తయారు చేసి ప్రతిష్టించి పూజిస్తారు.

అనేక మాల్స్

P.C: You Tube

ఆ గణపతి విగ్రహాన్ని తయారు చేయడం కూడా మనం చూడవచ్చు. పర్యావరణ హితకారిణి గణపతి విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని కూడా మనం ఖరీదు చేయవచ్చు. ఇనార్బిట్ మాల్ మాదిరిగానే అనేక నగరంలోని ప్రతి మాల్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలనే ప్రతిష్టిస్తోంది.

జయనగర 4వ బ్లాక్

P.C: You Tube

వినయక చవితి ఉత్సవంలో భాగంగా విగ్రహాల కొనుగోలు కూడా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా కే.ఆర్ మార్కెట్, మాగడి రోడ్, మల్లేశ్వరం, బీవీకే అయ్యంగార్ రోడ్డులోని సండేబజార్ లో రకరకాల గణేష విగ్రహాలు మనకు లభిస్తాయి.

వైవిద్యమైన గణపతి విగ్రహాలు

P.C: You Tube

వీటన్నింటితో పోలిస్తే జయనగర 4వ బ్లాక్ లో ఎక్కు వైవిద్యంతో కూడుకున్న గణపతి విగ్రహాలను మనం చూడవచ్చు. చాలా మంది ఈ విగ్రహాలను చూడటానికే ఈ జయనగర 4వ బ్లాక్ కు వస్తుంటారు. ఇక్కడ గణపతి విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది.

వినాయక దేవాలయాలు, మంటపాలు

P.C: You Tube

వినాయక చవితి సందర్భంగా నగరంలోని అనేక దేవాలయాలు, మంటపాలు ఎంతో అందంగా ముస్తాబై ఉంటాయి. నగరంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు అత్యంత ఎక్కువ ఖర్చుపెట్టి నిర్మించే మంటపాలు కూడా ఎన్నో ఉన్నాయి.

దొడ్డ గణపతి దేవాలయం

P.C: You Tube

ఇక దేవాలయాల విషయానికి వస్తే బసవన గుడిలోని దొడ్డ గణపతి, మైసూరు రోడ్డులోని పంచముఖ గణపతి, మల్లేశ్వరంలోని జంబు గణపతి దేవాలయం, అదే మల్లేశ్వరం సర్కిల్ లోని మహాగణపతి దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి.

టెక్కీ గణపతి దేవాలయం

P.C: You Tube

టెక్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో టెక్కీ గణపతి దేవాలయం కూడా ఉంది. 1979లో నగరానికి చెందిన అనేక మంది టెక్కీలు కలిసి కోరమంగళ లేవుట్ లోని కేహెచ్ బీ లే అవుట్ లో ఈ టెక్కీ గణపతి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు.

పవర్ గణేష దేవాలయం

P.C: You Tube

అదే విధంగా జయనగర 4వ బ్లాక్ లో జైన్ దేవాలయం ఎదురుగా ఉంది. ఈ దేవాలయాన్ని ఎక్కువగా రాజకీయనాయకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల అధికారం లభిస్తుందని వారి నమ్మకం.

Read More About: tour travel temple bangalore

Have a great day!
Read more...

English Summary

Here we listed the best places in bangalore to celebrate the Ganesha Chaturthi. Read on.