దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో కల విశాఖ పట్టణం జిల్లాలో కల అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. ఈ ప్రాంతం ఇంకా అధిక వాణిజ్యాన్ని పొందక పోవటంతో ఇది ఎంతో అందమైన హిల్ స్టేషన్ గానే వుంది. ఈ లోయ అందాలు అనేక టాలీవుడ్ సినిమాలలో ప్రదర్శిస్తారు. హ్యాపీ డేస్, డార్లింగ్ మరియు, కధ వంటి సినిమాలు కొంత భాగాన్ని ఇక్కడే షూట్ చేసారు.
అరకు వాలీ వైజాగ్ జి సుమారు 114 కి. మీ.లు దూరం వుంటుంది. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు. వాలీ లో అధిక జీవ వైవిధ్యం కల అనంతగిరి మరియు సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ లు . వాలీ చుట్టూ రక్త కొండ , చితమో గొంది, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు కలవు. గాలికొండ రాష్ట్రం లోనే అతి పొడవైన కొండ గా చెపుతారు.
అరకు వాలీ అందమైన ప్రదేశమే కాక, అనేక కాఫీ తోటలకు కూడా పేరు గాంచినది. తాజా కాఫీ గింజల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. ఈ వాలీ లో కల అనేక గిరిజన తెగలకు ఈ తోటలు జీవనం కలిగిస్తాయి. దేశం లో మొదటి సారిగా ఈ ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకం సుమారు 2007 నుండి ఇక్కడ ప్రవేశ పెట్టారు. అరకు ఎమరాల్డ్ అని బ్రాండ్ పేరు పెట్టారు. ఈ కాఫీ ని దేశం లోను, అంతర్జాతీయం గాను ఆదరిస్తున్నారు. దీనితో స్థానికంగా వేలాది ప్రజలకు ఉపాధి లభించింది.
ప్రదేశ ఆకర్షణలు
అరకు వాలీ లో కాఫీ తోటలే కాక ట్రైబల్ మ్యూజియం, టిఅడా , బొర్రా గుహలు, సంగదా ఫాల్స్ మరియు పద్మాపురం బొటా నికల్ గార్డెన్స్, వంటి ఆకర్షణలు కలవు. ప్రకృతి అందించే మంచి సువాసనల ఈ తోటలను తప్పక చూడాలి. అయితే, పర్యాటకులు అరకు వాలీ ఆకర్షనలను వాటి చరిత్ర, సంస్కృతి అర్ధం చేసుకునేటందుకు తప్పక చూడాల్సిందే.
ఎలా చేరాలి?
ఈ హిల్ స్టేషన్ చేరేందుకు రైలు లేదా రోడ్ మార్గాలు అనుకూలం గా వుంటాయి. ఇక్కడ రెండు రైలు స్టేషన్ లు కలవు. ఒకటి అరకు , మరొకటి అరకు వాలీ. రెండు రైలు స్టేషన్ లు కూడా వైజాగ్ కు కలుపబడి వున్నాయి. ఈ రైలు స్టేషన్ లు కోతవలస...కిరండూల్ రైలు లైన్ పై కలవు. ఇవి, ఈస్ట్ కోస్ట్ రైల్వే లో భాగం. శిమిలిగూడ రైలు స్టేషన్ అత్యధిక బ్రాడ్ గేజ్ జలిగి వుంది సముద్ర మట్టానికి సుమారు 996 మీటర్ల ఎత్తున కలదు. దీనికి ఎయిర్ పోర్ట్ లేదు. అరకు వాలీ చేరేందుకు పర్యాటకులు ఎ పట్టణం నుండి అయినా సరే టాక్సీ ల లో చేరవచ్చు. అరకు చేరేందుకు, వెనక్కు వచ్చేందుకు రెగ్యులర్ ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ లు కలవు. హైదరాబాద్ , వైజాగ్ ల నుండి డీలక్స్ మరియు వోల్వో బస్సు లు నడుస్తాయి.
వాతావరణం
అరకు వాలీ సంవత్సవరం అంతా ఒక మోస్తరు వాతావరణం కలిగి వుంటుంది. శీతాకాలం మితమైన చలి తో వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది. వేసవి లో వేడిగా వుండే ప్రదేశాల నుండి ఇక్కడకు వచ్చి చల్లదనాన్ని అనుభవిస్తారు. వాలీ సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు.