Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అతిరాప్పిల్లి » వాతావరణం

అతిరాప్పిల్లి వాతావరణం

అత్యుత్తమ కాలం:ఈ ప్రాంతం సంవత్సరం అంతా సందర్శించతగ్గదే అయినా, వేసవి బాగా వేడిగా ఉంటుంది. చలికాలం అన్నిటి కంటే బావుంటుంది. వర్షాకాలం లో జలపాతాలు అత్యద్భుతంగా ఉన్నా, వర్షాల వల్ల రహదారుల పరిస్థితి కొంత మేర దెబ్బ తిని ప్రయాణం కాస్త అపాయకరంగా మారుతుంది .

వేసవి

వేసవి: అతిరాప్పిల్లి ఉష్ణ మండల సమశీతోష్ణ స్థితి గల ప్రాంతం. ఉష్ణోగ్రత సంవత్సరం పొడువునా సమతుల్యంగా ఉంటుంది.ఈ కాలం వెచ్చగా , కొంచెం ఇబ్బంది గా ఉంటుంది. మార్చి నించి మే దాకా వేసవి కాలం. ఉష్ణోగ్రతలు 30 నించి 36 డిగ్రీల సెంటి గ్రేడ్ దాకా ఉంటాయి. ఇది ఏడాది లో కెల్లా అత్యంత వేడిగా ఉండే సమయం. సాధారణంగా పొడి గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం: రుతుపవనాలు భారీ వర్షాలను కురిపిస్తాయి. ఈ వానల వల్ల అతిరాప్పిల్లి లోని మూడు జలపాతాలు పరువళ్ళు తొక్కుతాయి. జూన్ నించి సెప్టెంబర్ దాకా వర్షాకాలం. అయితే అక్టోబర్ , నవంబర్ లలో కూడా వానలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం: డిసెంబర్ లో మొదలయ్యే చలికాలం ఫిబ్రవరి చివరి దాకా ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటి గ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత ఆహ్లాదకరమైన 20 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు వుంటుంది. జనవరి అత్యంత చల్లని మాసం.