బాదామి వాతావరణం - బాదామి సందర్శనకు సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి నెలలు అనుకూలం. ఈ సమయంలో సైట్ సీయింగ్ కు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలలో చిన్నపాటి ట్రిప్ లు వేయవచ్చు. కాని వర్షాలు అధికంగా ఉంటాయి.
వేసవి (మార్చి నుండి జూన్) - వేసవి చాలా వేడి. ఉష్ణోగ్రత గరిష్టం 45 డిగ్రీలు. కనుక ఏప్రిల్ మరియు మే నెలలలో పర్యాటకులు రారు.
వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో బాదామి లో వర్షాలు అధికమే. అయితే, ప్రదేశాలు ఎంతో అందంగా కనపడుతూంటాయి.
చలికాలం ( నవంబర్ నుండి ఫిబ్రవరి) - బాదామి ఈ కాలంలో ఎంతో చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రులలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా ఉండి పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉంటుంది. ఈ కాలం సందర్శనకు అనుకూలం.