Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బలంగీర్ » వాతావరణం

బలంగీర్ వాతావరణం

బలంగీర్ లో వాతావరణం బలంగీర్ సందర్శనకు అక్టోబర్, ఫిబ్రవరి మధ్య ఉండే శీతాకాలం అనువుగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వేసవి

వేసవి కాలం బలంగీర్ లో 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన వెచ్చటి వేసవి కాలం ఉంటుంది. చెమటలు పట్టే వేసవి కాలపు ఉష్ణోగ్రతలోని వేడికి డిహైడ్రేషన్, వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడమే మంచిది. వేసవికాలం మార్చిలో మొదలై మే వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయ్యే వర్షాకాలం సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. అయితే, అక్టోబర్ చివరి వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. తరచూ పడే వర్షాలు చెమటలు పట్టే ఎండ నుండి ఉపశమనాన్ని కల్గిస్తాయి. వర్షాకాలంలో బలంగీర్ లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం ఒక సంవత్సరానికి సుమారు 1216 మిల్లీమీటర్లు ఉంటుంది.

చలికాలం

శీతాకాలం బలంగీర్ లో శీతాకాలం ఎంతో చల్లగా ఉంటుంది. అక్టోబర్ చివర్లో మొదలైన చలి, నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అలాగే ఉంటుంది. ఉష్ణోగ్రత తరచూ 3 డిగ్రీ సెల్సియస్ల కనిష్ట స్థాయికి పడిపోతుంది. బలంగీర్ పర్యటనకు శీతాకాలం సరైన సమయం.