Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » వాతావరణం

బెంగళూరు వాతావరణం

వాతావరణం :బెంగళూరు సందర్శించడానికి చలికాలం మంచి సమయం (అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా) – అప్పుడు వాతావరణం సాధారణం గాను, హాయి గోల్పేది గాను వుంటుంది. అయితే, ఇక్కడి సగటు ఉష్ణోగ్రతల వల్ల బెంగళూరు ఎప్పుడైనా చూడవచ్చు.

వేసవి

వేసవి.బెంగళూరు లో సాధారణంగా ఉష్ణోగ్రతలు మితంగానే వుంటాయి, వేసవి లో కొన్ని మినహాయింపులు తీసేస్తే. మార్చ్ నుంచి మే వరకు వేసవి నడుస్తుంది – అప్పుడప్పుడు ఎక్కువ వేడి వుంటుంది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్షియస్ లేదా 68 డిగ్రీలు ఫారెన్ హీట్ నుంచి 35 డిగ్రీల సెల్షియస్ లేదా  95 డిగ్రీలు ఫారెన్ హీట్ వరకు వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంమే నెలాఖరుకల్లా బెంగళూరు లో ఋతు పవనాలు వచ్చి తొలకరి జల్లు పడుతుంది. అటు నైరుతి, ఇటు ఈశాన్య ఋతు పవనాలు రెండూ నగరాన్ని తాకడం వల్ల ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్ల గానే వుంటుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలం లో 19 డిగ్రీలు సెల్షియస్ లేదా 66.2 డిగ్రీలు ఫారెన్ హీట్  నుంచి 29 డిగ్రీలు సెల్షియస్ లేదా 84.2 డిగ్రీలు ఫారెన్ హీట్  మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

చలికాలం

శీతాకాలంశీతాకాలం లో ఉష్ణోగ్రతలు  12 డిగ్రీలు సెల్షియస్ లేదా  53.6 డిగ్రీలు ఫారెన్ హీట్  నుంచి  29 డిగ్రీలు సెల్షియస్ లేదా  84.2 డిగ్రీలు ఫారెన్ హీట్ మధ్య వుంటాయి – ఇది బెంగళూరు ను సందర్శించడానికి మంచి సమయం. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా శీతాకాలం నడుస్తుంది – జనవరి అన్నిటి కన్నా చల్లగా వుండే నెల.