Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బారాముల్లా

బారాముల్లా - వరాహ దంతం...!

13

కాశ్మీరు లో గల 22 జిల్లాలలో బారాముల్లా ఒకటి. 4190 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ జిల్లాని 8 తాలుకాలు 16 పంచాయితీలుగా విభజించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు యొక్క పశ్చిమ భాగం ఈ జిల్లా కి ఒక సరిహద్దు. ఈ జిల్లాకి తూర్పు దిక్కున శ్రీనగర్, లడఖ్ లున్నాయి. కుప్వార పట్టణానికి దక్షిణాన, పూంచ్ మరియు బడ్గాంకి ఉత్తర దిక్కులో బారాముల్ల ఉంది.

ఈ పురాతన నగరం క్రీ.పూ.2306 లో భీంసీన రాజా వారిచే స్థాపించబడినది. ఈ ప్రదేశాన్ని మొఘలు చక్రవర్తి అక్బర్ క్రీ.శ. 1508 లో దర్శించాడు. కాశ్మీరుకి వెళుతూ మార్గమధ్య లో దీని అందానికి ముగ్ధుడైన జహంగీరు ఇక్కడే కొంతకాలం నివసించాలని నిర్ణయించుకున్నాడు. సుప్రసిద్ధ చైనీ టూరిస్ట్ హ్యూయాన్ త్స్సాంగ్ కూడా ఒకసారి బారాముల్లా జిల్లాని దర్శించాడు.

బారాముల్ల అన్న పేరు సంస్కౄత పదాలైన "వరాహ" మరియు "ముల్" నుండి వచ్చింది. వరాహము అనగా పంది,"ముల్" అనగా దంతము. కాశ్మీరు యొక్క పురాతన కావ్యమైన "నిల్మతపూర్ణ" లో ఈ ప్రదేశానికి ఆ పేరు రావడానికి గల చారిత్రక కారణం వివరించబడినది.

ఆ కావ్యం ప్రకారం,కాశ్మీరు ప్రాంతము మొట్టమొదట జలోధ్భవుడనే రాక్షసుడి ఆధ్వర్యంలో ఉన్న "సైసార" అనే సరస్సు. ఈ రాక్షసుడి పీడ వదిలించడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరించి జలోద్భవుడున్న కొండని తన దంతంతో చీల్చడంతో నీరు బయటకి ప్రవహించింది.

సందర్శుకులు బారాముల్లాలోగల గురుద్వారాలు,గుడులు,దేవాలయాలు,మఠాలని సందర్శిస్తూ ఉంటారు. బారాముల్లా కి వెళ్ళినప్పుడు సందర్శకులు, సముద్ర మట్టానికి 2730 మీటర్ల ఎత్తులో ఉన్న గుల్మార్గ్ పట్టణాన్ని తప్పక దర్శించాలి. గుల్మార్గ్ కి మొదట గౌరీ మార్గ్ అని పేరు.తరువాత 16 వ శతాబ్దం లో దానిని గుల్మార్గ్ అనగా "పూల లోయ" గా మార్చారు. గుల్మార్గ్ లో గల గోల్ఫ్ మైదానం ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉన్న పచ్చటి గోల్ఫ్ మైదానంగా గుర్తించబడింది. ఈ గోల్ఫ్ మైదాన నిర్వాహకులు జమ్మూ కాశ్మీరు టూరిజం అభివ్రుద్ధి సంస్థ కి అనుబంధం గా పనిచేస్తారు. ఈ గోల్ఫ్ మైదానంతో పాటు ఖిలన్ మార్గ్,అచ్చాబల్,గోండోలా లిఫ్ట్,తంగ్మార్గ్,వెరినాగ్,గుల్మార్గ్ బిషప్ రిజర్వ్ లు దగ్గరలోని కొన్ని దర్శనీయస్థలాలు.

"పరిహాస్పోర" పట్టణం బారాముల్లా జిల్లా లోని మరొక దర్శనీయస్థలం. రాజా శంకర్వెర్మన్ కాలంలో ఈ పట్టణం కాశ్మీరు రాజ్య రాజధానిగా ఉండేది. పురావస్తు స్మారక చిహ్నాలైన "పరిహాస్పోర పట్టన్" మరియు "పట్టన్ బజార్" లని సందర్శకులు తరచుగా దర్శిస్తూ ఉంటారు. 1914 తవ్వకాలలో బయట పడిన "విష్ణు మందిరాలు","రాజ్ భవన్", "చైత్య"(బుద్ధ/జైన స్థూపం) లని దర్శించవచ్చు.

సమయం ఉంటే సందర్శకులు "వులార్ సరస్సు","మన్సబల్ సరస్సు","అల్పాటర్ సరస్సు" లని కూడా దర్శిచవచ్చు. ఇవే కాకుండా బారాముల్లా లో మత పర కట్టడాలనేకం ఉన్నాయి. వాటిలో తంగ్మార్గ్ లో గల "జెయరత్ బాబా రేషీ",సోపోర్ లో గల "జెయరత్ తుజ్జర్ షరీఫ్", అహ్మద్పూరా లో ఉన్న "ఇమాంబరా గూం" మరియు "జేరత్ జంబాజ్ వాలి " లు ముఖ్యమైనవి.

"జెయరత్ దస్త్గిర్ సాహెబ్",వత్లాబ్ లో ఉన్న "జెయరత్ బాబా షక్రుద్దీన్",బండీపురా లో గల "జెయరత్ అహీం షరీఫ్" లు ప్రసిద్ధి చెందిన దేవాలయాలు. సందర్శకులు "మహారాణీ/మోహినేస్వర శివాలయం " గా పిలవబడే శివాలయాన్ని కూడా దర్శించవచ్చు.

ఈ దేవాలయం 1915 లో కాశ్మీరు రాజు మహారాజా హరిసింగ్ సతీమణి మోహినీ బల్ సిసోడియా చే నిర్మించబడీంది. ఈ గుడి గర్భాలయంలో లయకారుడైన శివుడు మరియు ఆయన అర్ధాంగి పార్వతీ దేవి ఉంటారు. చత్తీ పడ్షాహీ లోగల సిక్కు దేవాలం కూడా దర్శనీయ స్థలమే.ప్రక్రుతి మధ్య లో పచ్చటి పర్వతాల మధ్య గల సహజ సిద్ధ జలపాతాలు,సరస్సులు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. ప్రక్రుతి ప్రేమికులకి ఇది చక్కటి విడిది.

రైలు,రోడ్డు, వాయు మార్గాలలో దీని ద్వారా అయినా సందర్శకులు బారాముల్ల ని చేరుకోవచ్చు. ఏప్రిల్-జూలై మధ్యలో ఇక్కడ వేసవి కాలం. ఆ కాలమే బారాముల్లాని దర్శించటానికి అనువైన సమయం.

"స్కీయింగ్" అంటే ఆసక్తి ఉన్న సందర్శకులు శీతాకాలం తొలినాళ్ళలో బారాముల్లాని దర్శించవచ్చు.

ఇతర దర్శనీయ స్థలాలు:గుల్మార్గ్,బారాముల్ల(ఇది శ్రీనగర్ సందర్సకులకి కూడా దర్శనీయ స్థలం)అల్పాతర్ సరస్సు(ఇది గుల్మార్గ్ సందర్సకులకి కూడా దర్శనీయ స్థలం)ఖిలన్ మార్గ్ (ఇది గుల్మార్గ్ సందర్సకులకి కూడా దర్శనీయ స్థలం)మహారాణీ టెంపుల్ గా పిలవబడే శివుడి గుడి(ఇది గుల్మార్గ్ సందర్సకులకి కూడా దర్శనీయ స్థలం)గుల్మార్గ్ బయోస్ఫియర్ రిజర్వ్(ఇది గుల్మార్గ్ సందర్సకులకి కూడా దర్శనీయ స్థలం)జియారత్ బాబా రేషి,బారాముల్ల(బాబా రేషీ గుడి గా గుల్మార్గ్ సందర్శకులకి సుపరిచతం)

బారాముల్లా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బారాముల్లా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బారాముల్లా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బారాముల్లా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రైలు,వాయు మార్గాలే కాకుండా బారాముల్ల సందర్శకులు రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. బారాముల్ల పరిసర ప్రాంతాలైన కార్గిల్,జమ్ము,శ్రీనగర్ ల నుండి బారాముల్లా కి బస్సు సౌకర్యాలున్నాయి. పైన పేర్కొన్న ప్రదేశాలకి న్యూ ఢిల్లీ,అంబాలా,లూధియానా,షింలా ల ద్వారా డైరెక్ట్ బస్సు ల ద్వారా చేరుకున్న సందర్శకులని జమ్ము రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు గరిష్టంగా 50 రూపాయల చార్జీ వసూలు చేసి బారాముల్ల చేరుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జమ్ము తావీ రైల్వే స్టేషన్ బారాముల్లా కి దగ్గర లో గల స్టేషన్. ఇది బారాముల్ల కి 360 కి.మీ. దూరం లో ఉంది. జమ్ము తావి రైలు జంక్షను అనేక ముఖ్య పట్టణాలు, నగరాలకి అనుసంధానించబడి ఉంది. వాటిలొ న్యూ ఢిల్లీ, ముంబాయి,కోల్ కతా ,లూధియానా,జలంధర్, ఆగ్రా వంటివి మచ్చుకు కొన్ని. జమ్ము తావీ ని చేరుకున్న సందర్శకులు బస్సు లేదా ట్యాక్సీ ల ద్వారా బారాముల్లా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం బారాముల్లా కి 66 కి.మీ. దూరం లో గల శ్రీనగర్ ఎయిర్ బేస్ బారాముల్లకి అతి దగ్గరి విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని "షైక్ ఉల్ ఆలం" విమానాశ్రయమ ని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం భారత దేశ ముఖ్య నగరాలతో అనుసంధానించబడి ఉంది. వాటిలో ఢిల్లీ,చండీఘర్,ముంబై,షింలా వంటివి మచ్చుకు కొన్ని. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకొన్న సందర్శకులు బస్సు లేదా ట్యాక్సీ ల ద్వారా బారాముల్లా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun