పర్యటనకు మంచి సమయం బార్మర్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలం. వేసవి వేడి తర్వాత ప్రాంతంలో అక్టోబర్ నుండి వాతావరణం చల్లబడి ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయం పర్యటనకు అనుకూలం. ధార్ ఎడారి పండుగ ఇక్కడ మార్చి నెలలో జరుగుతుంది. అపుడు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.
వాతావరణం బార్మర్ లో వాతావరణం సంవత్సరం పొడవునా ఎడారి వాతావరణం వలే పొడిగా ఉంటుంది. వేసవులు మరింత వేడి. వర్షాలు తక్కువ, శీతాకాలం అధిక చలి. వేసవి ( మార్చి నుండి మే) బార్మర్ లో వేసవులు అధిక వేడి. ఉష్నోగ్రతలు గరిష్టం 46 డిగ్రీలుగా మే నెలలో ఉంటాయి. కనిష్ట ఉష్నోగ్రతలు 23 డిగ్రీ సెంటి గ్రేడ్ గా ఉంటాయి.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) ఈ ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువ వర్షాకాలంలో కూడా పొడిగాను వేడిగాను ఉంటుంది. అయితే, వాయుగుండాల కారణంగా కొన్ని సార్లు అధిక వర్షాలు పడే అవకాశం కలదు. వర్షాలు తక్కువ కారణంగా ఈ ప్రాంతం దేశంలోని కరువు ప్రాంతాలలో ఒకటిగా చెప్పవచ్చు.
శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) బార్మర్ లో శీతాకాలం రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలలో వలే చలి అధికంగా ఉండదు. ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి గరిష్టం 36 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు మారతాయి. జనవరి నెల మాత్రం అధిక చలిగా ఉంటుంది.