ప్రముఖ ధార్మిక కేంద్రం భాగ్సునాగ్ దేవాలయం, సముద్ర మట్టానికి 1770 మీటర్ల ఎత్తున వుంది. శివుడి కోసం నిర్మించిన ఈ దేవాలయం మధ్యయుగాల నాటి కళా, సంస్కృతులను చిత్రిస్తుంది. ఈ పురాతన దేవాలయాన్ని హిందువులు, గూర్ఖాలు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయం ఆవరణలో అందమైన కొలనులు...
ఈ జలపాతాలు చిన్నవైనప్పటికి అందమైనవి. భాగ్సునాత్ టెంపుల్ కు అర కిలో మీటర్ దూరం లో వుంటాయి. వీటిని చేరాలంటే, ట్రెక్కింగ్ రూట్ కలదు. వర్షాలు పడితే చాలు, ఈ జలపాతాలు 30 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. కింద పడ్డ నీటిలో స్విమ్మింగ్ , స్నానాలు చేసి ఆనందించవచ్చు.
ఇంద్రహార్ పాస్ సాహస ప్రేమికులకు సరైన గమ్యస్థానం, అదీ పర్వతారోహణ చేయాలనుకుంటే. సముద్ర మట్టానికి 4342 మీటర్ల ఎత్తున వున్న ఈ పాస్ ధవళాధర్ పర్వత శ్రేణుల్లో వుంది. ఈ పాస్ చంబా, కాంగ్రా జిల్లాలకు భౌగోళిక సరిహద్దుగా పని చేస్తూవుంది. ఇక్కడికి ధర్మశాల, మెక్లియాడ్గంజ్ ల...
ఇంద్రహార్ పాస్ కు పడమటి దిక్కున మింక్యాని పాస్ వుంది. ఇక్కడికి కూడా ధర్మశాల నుంచి చంబా కు వెళ్ళే పర్వతారోహణ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడినుంచి యాత్రికులు ఉత్తరాన వున్న పర్వతాల అందాలను చూడవచ్చు. ఈ పాస్ ను కరేరి సరస్సు నుంచి కూడా పర్వతారోహణ ద్వారా చేరుకోవచ్చు....