ప్రయాణానికి ఉత్తమ సమయం : భాగ్సు లో మంచు కురవడాన్ని ఆస్వాదించడానికి చాలా మంది పర్యాటకులు శీతాకాలంలో ఇక్కడికి వస్తారు. వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది కనుక వేసవి లో కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తారు.
భాగ్సు లో ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఇక్కడ వేసవికాలంలో వాతావరణం మధ్యస్తంగా, శీతాకాలం చల్లగా ఉంటుంది. వేసవి (మే నుండి జూన్ వరకు): భాగ్సు లో వేసవి మే నెలలో ప్రారంభమై జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 13 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు ఈ సమయంలో సందర్శించడానికి ఇష్టపడతారు.
వర్షాకాలం (జూలై నుంచి ఆగష్టు) భాగ్సు లో వర్షాకాలం జూలై నుంచి ఆగష్టు దాకా వుంటుంది. వర్షపాతం లేని సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతాన్ని ఎంతో మంది యాత్రికులు సందర్శిస్తారు.
శీతాకాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి) : శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుంటుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 3 నుంచి 8 డిగ్రీల మధ్య వుంటాయి. డిసెంబెర్, జనవరి నెలల్లో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు ఉన్ని దుస్తులు తీసుకువెళ్ళడం మంచిది.