Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భీమశంకర్

భీమశంకర్ - ఒక సమీక్ష

13

మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి.

భీమశంకర్ పూనే నగరానికి దగ్గరగా ఖేడ్ పట్టణానికి వాయువ్యంగా సుమారు 568 కి.మీ.ల దూరంలో షిరాధోన్ గ్రామంలో 3250 అడుగుల ఎత్తున కలదు. ఈ దేవాలయం సహ్యాద్రి కొండల శ్రేణి ప్రాంతంలో కలదు. భీమశంకర్ భీమానది పుట్టిన ప్రాంతం. ఈ నది ఆగ్నేయ దిశగా ప్రవహించి క్రిష్ణా నదిలో కలసిపోతుంది.  

మతపర ప్రదేశం - ఇతిహాసం మేరకు శివ భగవానుడు సహ్యాద్రి కొండలలో భీముడి అవతారంగా దేవతల కోరిక మేరకు నివసిస్తున్నాడని చెపుతారు. త్రిపురాసురుడనే రాక్షసుడితో శివుడు పోరాడి ఆ రాక్షసుడిని వధించాడు. ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడి శరీరంనుండి ప్రవహించిన చెమట ధారలే భీమ నదిగా ప్రవహించాయని చెపుతారు.

ఈ ప్రాంతంలో మరి కొన్ని దేవాలయాలు కూడా కలవు. కమలాజ - పార్వతీ దేవి అవతారం. మోక్షకుండ తీర్ధ - ఇది భీమ శంకర్ దేవాలయ వెనుక భాగంలో కలదు. కుషారణ్య తీర్ధ మరియు సర్వతీర్ధ ఇతర మతపర ప్రదేశాలు. వీటిని తప్పక చూడాలి.

భీమశంకర్ ప్రదేశం తీర్ధ యాత్రికులకు మాత్రమే స్వర్గంగా ఉండదు. ఇది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వర్గం లానే ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో ట్రెక్కింగ్ అవకాశాలు కలవు. ఈ ప్రాంతం అంతా సహ్యాద్రి కొండల కిందకు వస్తుంది. ఎన్నో రకాల పక్షులు ఇక్కడి రిజర్వు అటవీ ప్రదేశంలో ఉంటాయి. వివిధ రకాల వన్య జీవులు కూడా ఈ ప్రదేశంలో సంరక్షించబడుతున్నాయి. గ్రేట్ ఇండియన్ స్వ్విర్రల్ లేదా ఉడుత తప్పక చూడదగిన జంతువులలో ఒకటి.  భీమశంకర్ ప్రదేశం మతపర అభిమానులకే కాదు సాహస క్రీడా కారులకు కూడా ఖ్యాతిగాంచిన ప్రదేశం. పచ్చటి ప్రదేశాలను ప్రదర్శిస్తూ పర్యాటకుల మనసులను దోచుకునే ప్రదేశంగా ఉంటుంది.  

భీమశంకర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భీమశంకర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భీమశంకర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భీమశంకర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం భీమశంకర్ కు ప్రతిరోజూ వివిధ ప్రదేశాలనుండి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది. పూనే నుండి రోడ్డు ద్వారా భీమశంకర్ 127 కి.మీ. లు మాత్రమే. ముంబై నుండి సుమారు 200 కి.మీ. దూరం ఉంటుంది. బస్ ఛార్జీలు సగటున సుమారుగా రూ.300 గా పూనా నుండి మరియు ముంబై నుండి రూ.800 గాను ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం భీమశంకర్ కు పూనే రైలు స్టేషన్ సమీపం. సుమారు 95 కి.మీ.ల దూరం కలదు. ఇక్కడినుండి ప్రతిరోజూ దేశంలోని అనేక పట్టణాలకు రైళ్ళు నడుస్తాయి. బెంగుళూరు నుండి ఉదయన్ ఎక్స్ ప్రెస్, చెన్నై నుండి ముంబై ఎక్స్ ప్రెస్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుండి, ముంబై నుండి మహలక్ష్మీ ఎక్స్ ప్రెస్ వంటివి పూనే కు ప్రతిరోజూ నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    భీమశంకర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం పూనేలోని లోహేగాంవ్ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ఇది సుమారు 95 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి ముంబై లేదా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా చేరవచ్చు. పూనే విమానాశ్రయం బయట భీమశంకర్ చేరేందుకు టాక్సీలు సుమారుగా రూ. 800 నుండి రూ. 900 ఛార్జీలతో దొరకుతాయి. నాసిక్ లోని గాంధీ నగర్ విమానాశ్రయం మరియు డయ్యు విమానాశ్రయాల ద్వారా కూడా ప్రయాణించవచ్చు. భీమశంకర్ కు ముంబైలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం 250 కి.మీ.ల దూరంలో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat