Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భున్టార్ » వాతావరణం

భున్టార్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : భుంటార్ ను ప్రయాణీకులు సెప్టెంబర్ – మార్చ్ నెలల మధ్య సందర్శించవచ్చు. మంచుతో కప్పబడిన శిఖరాలను సందర్శించడానికి చాలా మంది ప్రయాణీకులు ఇక్కడికి శీతాకాలంలోనే వస్తారు.

వేసవి

భు౦టార్ లో వాతావరణం ఏడాది పొడవునా స్థిరంగా వుంటుంది. వేసవి చాలా ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా వుంటు౦ది, శీతాకాలం చాలా గడ్డ కట్టే చలితో వుంటుంది. వర్షాకాలంలో ఇక్కడ బాగా వర్షం పడుతుంది.వేసవి (మార్చ్ నుంచి మే): భుంటార్ లో మార్చ్ లో మొదలయ్యే వేసవి మే దాకా వుంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు వుండగా కనిష్ట ఉష్ణోగ్రత 10దిగ్రీలున్తుంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. అందువల్ల ఈ కాలం లో వెళ్ళే పర్యాటకులు తేలికపాటి ఉన్నిడదుస్తులు తీసుకు వెళ్ళడం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్) : వర్షాకాలం ఇక్కడ జూన్ నుంచి సెప్టెంబర్ ల మధ్య వుంటుంది. ఈ కాలం లో వర్షాల వల్ల బహిరంగ కార్యకలాపాలు సాధ్యం కాదు కాబట్టి పర్యాటకులు ఇక్కడికి రావడం తగ్గిస్తారు.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుంచి ఫిబ్రవరి) భుంటార్ లో శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుంటుంది. అప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలదాకా పడిపోయి చాలా చల్లగా వుంటుంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 15డిగ్రీ డిగ్రీల వద్ద తారాడుతుంది.