Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బికనేర్

బికనేర్ – రాజ కోటలు, కథలు, ఉత్సవాలు !!

42

బికనేర్, ఈ రాజస్థాన్ పట్టణం బంగారు వన్నె ఇసుక దిబ్బలతో ఎడారి ప్రేమాయణానికి, పోరాడే ఒంటెలు, రాజపుత్ర రాజుల వీరోచిత కార్యాలకు ఉదాహరణ గా నిలుస్తుంది. ఈ ఎడారి పట్టణం థార్ ఎడారి మధ్యలో రాజస్థాన్లోని వాయువ్య భాగంలో ఉంది. దీనిని రాథోర్ యువరాజు రావు బికాజి 1488 లో స్థాపించాడు. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, రుచికరమైన భుజియాలకు, రంగురంగుల పండుగలకు, అద్భుతమైన భవనాలకు, అందమైన శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది.

నోరూరించే సంప్రదాయ వంటలు

శ్రీ దుంగర్ సింగ్ మహారాజు హయాంలో 1877 లో పుట్టిన భారి భుజియా పరిశ్రమకు బికనేర్ కేంద్రం. భుజియ ను మొట్ట మొదటగా దుంగర్ షాహి భుజియ పేరుతో మహారాజు గారి అతిధులకు వడ్డించడానికి వండారు. బికనేర్, నోరూరించే బికనేరి భుజియా, తీపి మీఠాయిలు, కారపు వంటకాలను ఉత్పత్తి చేసే ఈ పట్టణం బికాజి, హల్దిరాం వంటి ప్రపంచ ప్రసిద్ధ అంతర్జాతీయ స్థాయి పేర్ల ఉద్భవం వెనుక ఉంది. ఒక ప్రసిద్ధ కరకర లాడే అల్పాహరమైన బికనేర్ భుజియాను శనగ పిండి, మషాలాలు, పెసర పప్పు, వంట నూనె, ఉప్పు, కారం, మిరియాలు, యాలుకలు, లవంగాలను వాడి తయారు చేస్తారు. తీపి మీఠాయిలు, అల్పాహారం తయారు చేసే కంపెనీలలో ఒకటైన హల్దిరాం ను, గంగాబై సేన్ జి అగర్వాల్ బికనేర్ లో 1937 లో స్థాపించాడు.

బికనేర్ లోని ఒంటెల పండుగలు

నోరూరించే భుజియాలతో బాటుగా ఈ ఎడారి పట్టణ౦, భారతీయ, విదేశీ పర్యాటకులను కూడా బికనేర్ పండుగకు ఆహ్వానం పలుకుతుంది. ఈ పండుగ ఎడారి ఓడగా ప్రసిద్ది పొందిన ఒంటెలకు చెందినది. జునాగఢ్ కోట వద్ద నుండి ఈ పండుగ గొప్ప ఊరేగింపుతో మొదలౌతుంది. ఈ పండుగలో ఒంటెలను ఆభరణాలు, రంగురంగుల దుస్తులతో అందంగా అలంకరిస్తారు. ఒంటెల పందాలు, ఒంటెలనుండి పాలు పిండటం, ఉన్నిని ఆకృతిలో కత్తిరించడం, ఉత్తమ జాతి పోటీలు, ఒంటెల విన్యాసాలు, ఒంటె బ్యాండ్లు ఈ పండుగలోని ప్రసిద్ధ ఆకర్షణలు.

బికనేర్ లోని ఆకర్షణలు.

బికనేర్ సందర్శించ దలచు కొన్నపర్యాటకులు ప్రసిద్ధ ఇసుక రాయి కట్టడ౦ లాల్ఘర్ ను తప్పనిసరిగా చూడాలి. ఈ భవన నిర్మాణం రాజపుత్ర, మొఘల్, ఐరోపాల మిళితమైన అద్భుత నిర్మాణ శైలి ని వర్ణిస్తుంది. ముందుకు వచ్చిన వసారాల నుండి పరిసరాలను దూరం వరకు గమనించవచ్చు. ప్రసిద్ధ కట్టడమైన గజ్నేర్ భవనం బికనేర్ రాజులకు వేటకు, ఏకాంతంగా ఉండటానికి విడిదిగా ఉపయోగించే వారు. సంక్లిష్ట౦గా చెక్కిన స్తంభాలు, కిటికీలు, తెరలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. లేళ్ళు, నల్ల దుప్పులు, నిలగైస్, కృష్ణ జింకలు, నీలి ఎద్దులు, జింకలు వంటి జంతువులను ఈ భవనం బయటి వైపున చూడవచ్చు.

జునఘడ్ కోట, సదుల్ సింగ్ మ్యూజియం, గంగ గోల్డెన్ జూబ్లీ మ్యూజియం, భందసేర్ జైన దేవాలయం, లక్ష్మి నాథ దేవాలయం బికనేర్ లోని కొన్ని ఇతర పర్యాటక ఆకర్షణలు. సమయం అనుకూలిస్తే బికనేర్ సందర్శించే పర్యాటకులు శివ బారి దేవాలయం, రతన్ బేహారి దేవాలయం, కొలయాత్ దేవాలయం, కర్ణి మాత దేవాలయం, గజ్నేర్ అభయారణ్యం, ఒంటెల పెంపకం కేంద్రాలను చూడవచ్చు. ఇక్కడ హెరిటేజ్ హోటళ్ళు ఒంటెల సఫారి, జీప్ సఫారీ, రాత్రి సఫారి, ఎడారి శిబిరాలను అతిథులు క్లిష్టమైన ఎడారి జీవితాన్ని తెలుసుకోవడానికి నిర్వహిస్తున్నాయి.

బికనేర్ చేరుకోవడం

బికనేర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత సమీప విమానాశ్రయం జోధ్పూర్ లో ఉంది. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి కాబ్స్ ద్వారా సరైన ధరలలో బికనేర్ చేరవచ్చు. బికనేర్ రైల్వే స్టేషన్ కి జైపూర్, చురు, జోధ్పూర్, డిల్లీ, కలకా, హౌరా, భటిండా వంటి నగరాల నుండి రోజువారీ రైళ్ళ ద్వారా చేరుకోవచ్చు. డిల్లీ, జోధ్పూర్, ఆగ్రా, అజ్మీర్, అహ్మదాబాద్, జైపూర్, ఝున్ఝును, జైసల్మేర్, బర్మేర్, ఉదయపూర్, కోటా నుండి కూడా బికనేర్ కి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

బికనేర్ లో వాతావరణం

వేసవి, అదేవిధంగా శీతాకాలంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న బికనేర్ ఒక ఎడారి పట్టణం. వేసవిలో పగటికంటే రాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం మరింత తేమతో ఉంటుంది. ఇక్కడ శీతాకాలం డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. సంవత్సర౦ మొత్తంలో అక్టోబర్, మార్చ్ మాసాల మధ్య వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి బికనేర్ పర్యటనకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చిన్న పర్యటన చేయడానికి వర్షాకాలం కూడా అనువుగా ఉంటుంది.

బికనేర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బికనేర్ వాతావరణం

బికనేర్
34oC / 92oF
 • Sunny
 • Wind: WSW 27 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం బికనేర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? బికనేర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గ౦ ద్వారా: పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. డిల్లీ, జోధ్పూర్, ఆగ్రా, అజ్మీర్, అహ్మదాబాద్, జైపూర్, ఝున్ఝును, జైసల్మేర్, బార్మర్, ఉదయపూర్, ల;కోట నుండి బికనేర్ కి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. లాల్ ఘర్ పాలెస్ కి వెళ్ళే రోడ్డు కు ఎదురుగా బికనేర్ బస్ స్టాండ్ ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ద్వారా: బికనేర్ కి జైపూర్, చురు, జోధ్పూర్, డిల్లీ, కలకా, హౌరా, భటిండా వంటి భారతదేశం లోని ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. బికనేర్ ఎక్స్ప్రెస్, బికనేర్ మెయిల్ ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఎంచుకోదగ్గ రైళ్ళు. బికనేర్ రైల్వే స్టేషన్ నుండి నగరానికి కాబ్స్ ద్వారా వెళ్ళవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  ప్రయాణానికి ఉత్తమ మార్గం: బికనేర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయు మార్గం ద్వారా: బికనేర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్ సమీప దేశీయ విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు సమీప౦లోని న్యూ డిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయానికి కోల్కత్త, చెన్నై, బెంగళూర్, ముంబై వంటి భారతదేశంలో ప్రధాన ప్రాంతాలకు రోజువారీ విమానాలు ఉన్నాయి. పర్యాటకులు జోధ్పూర్ విమానాశ్రయం నుండి బికనేర్ చేరుకోవడానికి సరసమైన ధరలలో టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి

బికనేర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 Aug,Fri
Return On
15 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
14 Aug,Fri
Check Out
15 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
14 Aug,Fri
Return On
15 Aug,Sat
 • Today
  Bikaner
  34 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Bikaner
  31 OC
  89 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Bikaner
  31 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy