హన్హలాన్ విలేజ్ మిజోరం లోని చంఫాయి జిల్లా లో కలదు. ఇది రాష్ట్ర రాజధాని ఐజవాల్ కు 247 కి. మీ. ల దూరంలో కలదు. ఇది మయన్మార్ - ఇండియా సరిహద్దులలో కలదు. మయన్మార్ కు 5 కి. మీ. ల దూరం లో మాత్రమె వుంటుంది. ఈ విలేజ్ చరిత్ర 1897 నాటిది. అప్పటి నుండి 1954 లో తెగల నాయకత్వం రద్దు పరచే వరకూ సిలో చీఫ్ కై రంగా మరియు అతని వారసులూ దీనిని పాలించారు. తెగల నాయకత్వం రద్దు అయిన తర్వాత అయితే, ఇపుడు ఇది ఒక ప్రజాస్వామ్య మండలి అధీనంలో పాలించా బడుతోంది.
ఈ విలేజ్ దాని గొప్ప చరిత్ర కే కాక, సారాయి ఉత్పత్తి కి కూడా ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు సుమారు 80 శాతం వరకూ ఈ వైన్ ఉత్పత్తి లో ఉపాధి పొందుతారు. ఈ వైన్ జవలిది లేదా ప్రీ పాయస అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. అనేక సంవత్సరాలనుండి ఈ ఉత్పత్తి ఇక్కడ నిరాటంకంగా నడుస్తోంది. హన్హలాన్ చేరాలంటే ఐజవాల్ నుండి బస్సు లేదా సుమో వాహనాలలో చేరవచ్చు.



Click it and Unblock the Notifications