లియంచియరి లున్గ్లేంత్ లాంగ్ అనేది ఒక అద్భుత కొండ శిఖరం . ఇది చంఫయి జిల్లాకు 64 కి. మీ. ల దూరంలో దుంట్ లాంగ్ విలేజ్ లో కలదు. ఈ శిఖరం ఒక్కసారి చూస్తె చాలు, దిగ్భ్రమ పొందాల్సిందే.
ఈ కొండలపై కూర్చుని గంటలు గడిపేయ వచ్చు. నీలి ఆకాశం, అందమైన పర్వత శ్రేణులు అన్నీ చేర్చి ఒక స్వర్గం లో వాలే వుంటుంది. ఈ కొండ శిఖరానికి ఆ పేరు ఒక లవ్ స్టొరీ నుండి వచ్చింది. విలేజ్ చీఫ్ కూతురు ఒక సామాన్యుడి ప్రేమలో పడగా, అందుకు తండ్రి ఒప్పుకోక పోగా, అతడు దూరం గా వున్నా మరో విలేజ్ కి వెళితే ఆమె ఆ శిఖరంపై కూర్చుని అతని కొరకు వేచి వుంది పోయినది. అక్కడే కూర్చుని అనేక ప్రేమ పాటలు వ్రాసింది. ఈ ప్రదేశాన్ని బస్సు లేదా ప్రైవేటు కార్ లో చేరవచ్చు.



Click it and Unblock the Notifications