Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేల్ » వాతావరణం

చందేల్ వాతావరణం

ఉత్తమ కాలంచందేల్ ను సందర్శించాలంటే వానాకాలం చివరిలో మరియు శీతాకాలం ప్రారంభం అనుకూలంగా ఉంటాయి. ఎడతెరపి వానలు ఉన్నప్పుడు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వేసవికాలం కూడా సౌకర్యంగా ఉండదు ఎందుకంటే ఈ సమయంలో హ్యుమిడిటి ఎక్కువగా ఉండి చాలా అసౌకర్యంగా ఉంటుంది. తేలికపాటి దుస్తులు తప్పనిసరి.

వేసవి

వేసవికాలం: ఇక్కడ వేసవికాలం మార్చ్ నుండి మే లేక జూన్ నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుంది. వేసవికాలంలో చందేల్ సందర్శించాలనుకునేవారు నూలు దుస్తులు ధరించటం సుఖవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉరుములతో కూడిన జల్లులు సాధారణం.

వర్షాకాలం

వానాకాలం: ఇక్కడ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వానాకాలం ఉంటుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలవలెనే ఇక్కడ కూడా ప్రతిరోజూ వర్షపాతాన్నిచూడవొచ్చు. ఈ సమయంలో ఎడతెరపి వర్షపాతం ఉండటంవలన, తేమ పెరిగి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో చందేల్ సందర్శన అనుకూలంగా ఉండదు.

చలికాలం

శీతాకాలం: ఇక్కడ ఉష్ణోగ్రత శీతాకాలంలో గణనీయంగా పడిపోతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చలి తీవ్రంగా ఉండటంవలన, ఈ సమయంలో సందర్శించేవారు ఊలు దుస్తులు తప్పనిసరిగా ధరించాలి.