Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందిపూర్ » వాతావరణం

చందిపూర్ వాతావరణం

చండిపూర్ వాతావరణం చండిపూర్ సందర్శనకు శీతాకాలం సరైనదని చెప్పడంలో అనుమానంలేదు. శీతాకాలంలో ఇక్కడ ఇసుక పండుగ నిర్వహిస్తారు, హస్తకళలు, వస్త్రాల భారీ ప్రదర్శనలు కూడా ఉంటాయి. ప్రసిద్ధ కళాకారులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. శీతాకాలంలో చండిపూర్ సందర్శించేవారు వెచ్చని దుస్తులు తీసుకువెళ్ళడం మంచిది.  

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలతో ఎక్కువగా ఉంటుంది. రోజంతా వడగాలులు వీస్తాయి కాబట్టి జీవించడానికి అసౌకర్యంగా ఉంటుంది. ప్రజలు ఎండదెబ్బ, నిర్జలీకరణం తో బాధపడతారు.  

వర్షాకాలం

వర్షాకాలం ఎండ వేడినుండి ఉపశమనాన్ని కలిగిస్తూ వర్షాకాలం ప్రారంభమౌతుంది. రాష్ట్రం మొత్తం జులై నుండి సెప్టెంబర్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అనేక నదులు వరదల వల్ల, ప్రధాన రోడ్డు మార్గాలు జలమయం అవ్వడం వల్ల రాకపోకలు స్తంభిస్తాయి.  

చలికాలం

శీతాకాలం ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయి శీతాకాలంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం అక్టోబరు నుంచి ఫిబ్రవరి ఉంటుంది. చండిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తాయి. అయితే, పగళ్ళు ఆహ్లాదకరంగా ఉంటాయి.