Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కబల్లాపూర్ » వాతావరణం

చిక్కబల్లాపూర్ వాతావరణం

చిక్కబల్లాపూర్ వాతావరణంచిక్కబల్లాపూర్ సందర్శన అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - చిక్కబల్లాపూర్ లో వేసవులు చాలా వేడిగా అసౌకర్యంగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగాను ఉంటాయి.  వేసవి వేడి కారణంగా  వేసవిలో పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో ఉంటారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు చెదురు మదురుగా ఉంటాయి. బయట తిరిగేందుకు కష్టంగా ఉంటుంది కనుక పర్యాటకులు ఈ కాలంలో కూడా అధిక సంఖ్యలో సందర్శించరు.

చలికాలం

శీతాకాలం ( డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - చిక్కబల్లాపూర్ వాతావరణం శీతాకాలంలో ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుండి 32 డిగ్రీల మధ్య మార్పు చెందుతూంటాయి. పర్యాటకులకు ఎంతో అనువైన సమయం. పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.