సంవత్సరంలో ఎపుడైనా సరే చిక్కమగళూరు సందర్శించవచ్చు. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణం సైట్ సీయింగ్ కు అనుకూలం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో జలపాతాలు సందర్శించి ఆనందించవచ్చు.
వేసవి ( మార్చి నుండి మే) - చిక్కమగళూరు వాతావరణం వేసవిలో 35 డిగ్రీలు పగలు రాత్రులలో 32 డిగ్రీలు ఉంటుంది. పర్యాటకులు వేసవిలో అధిక సంఖ్యలో వస్తారు.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో చిక్కమగళూరులో వర్షపాతం అధికం. పర్యాటకులు ఇష్టపడతారు.
చలికాలం - (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) ఈ కాలంలో చల్లగా, ఆహ్లాదంగా ఉండి ప్రదేశాలు చక్కగా చూడవచ్చు. చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 17 కాగా గరిష్టం 20 డిగ్రీలు. చాలామంది చలికాలంలో వచ్చి ఆనందించేందుకు ఇష్టపడతారు.