Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » వాతావరణం

చిత్తోర్ ఘడ్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమకాలం : అక్టోబర్ నుండి మార్చ్ల మధ్య ఉన్న కాలం చిత్తోర్ ఘడ్ సందర్శనకు ఉత్తమమైనది. వాతావరణం ఆహ్లాదంగాఉండే ఈ సమయం, ప్రదేశాల సందర్శనకు యోగ్యమైనది.

వేసవి

వేసవి కాలం : చిత్తోర్ ఘడ్ లో మార్చ్ నుండి మే వరకు వేసవి కాలం ఉంటుంది. ఈ కాలంలో తీవ్రమైన వేడి తో, కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు 44 డిగ్రీల మధ్య వ్యాపించి ఉంటాయి. భరించ శక్యం కాని ఇటువంటి వాతావరణం వలన పర్యాటకులు ఈ కాలంలో ఈ ప్రాంత సందర్శనకు దూరంగా ఉంటారు..  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ ): తీవ్రమైన వేడితో కూడిన వేసవి నుండి అడపా దడపా పడే వర్షాలతో వర్షాకాలం ఉపశమనం కల్గిస్తుంది. ఈ ప్రాంతంలో సరాసరిన 60 నుండి 80 సెంటిమీటర్ల వర్షపాతం కురుస్తుంది.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : చిత్తోర్ ఘడ్ ప్రాంతంలో శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెంటి గ్రేడ్ నుండి 28 డిగ్రీల సెంటి గ్రేడ్ల మధ్య ఉంటాయి..