Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» డెహ్రాడూన్

డెహ్రాడూన్ - భారతదేశపు ప్రాచీన నగరం!

29

దూన్ వాలీ గా ప్రసిద్ది చెందిన డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి షుమారు 2100 అడుగుల ఎత్తువద్ద విస్తరించి ఉంది, ఇది శివాలిక్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉంది. యమునా నది పశ్చిమాన ప్రవహిస్తే, గంగా నది డెహ్రాడూన్ కి తూర్పు వైపున ప్రవహిస్తుంది. ‘డేహ్రా’ అనే పదం నుండి ఉద్భవించిన డెహ్రాడూన్ ‘డేహ్రా’ అనగా ‘కాంప్’, ‘డున్’ అనగా ‘పర్వతాల దిగువన ఉన్న తక్కువ భూములు’ అని అర్ధం.

సిక్కు గురువు రామ రాజ్ ఒక శిబిరాన్ని, ఒక ఆలయాన్ని నిర్మించిన ప్రదేశమైన డున్ నుండి రామ రాజ్ ను ముఘల్ పరిపాలకుడు ఔరంగజేబ్ బహిష్కరించాడు. ఈ స్థలం గొప్ప భారతీయ పురాణాలైన రామాయణ, మహాభారతాలలో కూడా పేర్కొనబడింది.

శ్రీరాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు రాక్షస రాజు రావణుడిని చంపిన తరువాత డెహ్రాడూన్ ని సందర్శించారని చెప్తారు. ఒకప్పుడు గురువు ద్రోణాచార్యులు కూడా ఇక్కడ నివసించారని మరో కధ చెప్తారు. ఇక్కడి పురాతన ఆలయాలు, అవశేషాలు దాదాపు 2000 సంవత్సరాల కిందటివి.

డెహ్రాడూన్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఈ ప్రదేశం ప్రతి ఏటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, సహజ పరిసరాలు పర్యాటకులలో బాగా ప్రసిద్ది గాంచాయి. అంతేకాకుండా, ఇది ముస్సోరీ, నైనిటాల్, హరిద్వార్, ఆవులి, రిషికేశ్ వంటి ఉత్తరాఖండ్ లోని కొన్ని అందమైన ఇతర ప్రదేశాలకు ప్రవేశ ద్వారం. డెహ్రాడూన్ భారతీయ మిలిటరీ అకాడమీ, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, అటవీ పరిశోధనా సంస్ధ, డూన్ పబ్లిక్ స్కూల్ వంటి కొన్ని పరిశోధనా, విద్య సంస్ధలకు నిలయం.

డెహ్రాడూన్-చక్రత రహదారిపై ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీ, బ్రిగేడియర్ ఎల్.పి.కొల్లిన్స్ నాయకత్వంలో 1932 వ సంవత్సరం అక్టోబర్ 1న స్థాపించబడింది. ఈ అకాడమీలో మ్యూజియం, యుద్ధ స్మారకాలు, షూటింగ్ ప్రదర్శన గది, ఫ్రిమ్స్  గోల్ఫ్ కోర్స్ ఉన్నాయి.

డెహ్రాడూన్ లోని కౌలాగడ్ పై ఉన్న మరో ప్రసిద్ధ సంస్ధ అటవీ పరిశోధనా సంస్ధ (FRI). ఇది 1906 వ సంవత్సరంలో ఏర్పాటుచేయబడింది. ఇది 2000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ సంస్ధ భవనం ఘనమైన, గ్రీకో-రోమన్ ఖచ్చితమైన మిశ్రమాన్ని ప్రదర్శిస్తూ, స్థానిక శైలిలో నిర్మించబడి ఉంటుంది.

సహస్త్రధారా తోపాటు డెహ్రాడూన్ లోని రాజాజీ నేషనల్ పార్క్, మల్సి జింకల పార్కు కొన్ని ఇతర పర్యాటక ఆకర్షణలు. డెహ్రాడూన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహస్త్రధారా అందమైన నీటిబుగ్గ. పర్యాటకులు అదేవిధంగా స్థానికులు ఈ ప్రాంతాన్ని వినోదం కోసం పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. 9 మీటర్ల లోతు కలిగిన ఈ నీటిబుగ్గ, నీరు చర్మ రోగాలతో బాధపడే ప్రజలకు చికిత్సగా పరిగణించబడుతుంది.

ఈ ప్రదేశం అందానికి, పురాతన ధార్మిక కేంద్రాలకు కూడా పేరుగాంచింది. లక్ష్మణ్ సిద్ధ ఆలయం, తప్కేశ్వర్ మహాదేవ ఆలయం, సంతల దేవి ఆలయం, తపోవన్ మొదలైనవి దేహ్రాహూన్ లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు. ఒక గుహాలయంగా పేరుగాంచిన తపకేశ్వర్ మహాదేవ ఆలయం శివునికి అంకితం చేయబడింది. తపక్ అనేది హిందీ పదం, దీనికి బొట్లుగా పడటం అనే అర్ధం. ఈ ఆలయంలోని సహజంగా ఏర్పడిన శివలింగంపై గుహ పైభాగం నుండి నీరు బొట్లుగా కారుతూ ఉంటుంది.

పర్యాటకులు ఈ అందమైన ప్రదేశాన్ని కారు లేదా నడిచి అన్వేషించవచ్చు. ఇక్కడి దుకాణాలు స్థానిక హస్తకళలకు, ఊలు దుస్తులకు, ఆభరణాలు, పుస్తకాలకు ప్రసిద్ది చెందాయి.

రాజపూర్ రోడ్, పల్తాన్ బజార్, ఆష్లెయ్ హాల్ మొదలైనవి డెహ్రాడూన్ లోని ప్రధాన షాపింగ్ ప్రదేశాలు. ఇక్కడి రెస్టారెంట్లు టిబెటన్ మోమోల వంటలకు ప్రసిద్ది చెందినవి. ఇక్కడ సహజ పరిసరాలు, విద్యా సంస్ధలు, పురాతన ఆలయాలు, స్మారకాలే కాకుండా, ఈ ప్రదేశం బాస్మతి బియ్యానికి ప్రత్యేకంగా పేరుగాంచింది.

స్థల సందర్శన, షాపింగ్ కాకుండా, ఈ నగరం అన్వేషణా ఔత్సాహికులకు స్వర్గం లాంటిది. దూన్ వాలీ లో పారాగ్లైడింగ్, స్కీయింగ్ వంటి ఆనందించే అనేక సాహసోపేత క్రీడలు ఉన్నాయి. సాహస ప్రేమికులు డెహ్రాడూన్ నుండి ముస్సోరీ కి 30 కిలోమీటర్ల చిన్న ఆహ్లాదకర పర్వహతారోహణకు వెళ్ళవచ్చు. రాజపూర్ ఈ పర్వతారోహణ సాహసయాత్రకు ప్రాధమిక శిబిరంగా సేవలందిస్తుంది.

డెహ్రాడూన్ చేరుకోవడం ఎలా

ఈ ప్రదేశం వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర ప్రదేశాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఈ నగర కేంద్రం నుండి జోల్లీ గ్రాంట్ విమానాశ్రయం 20 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. ఇది న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజువారీ విమానాల ద్వారా అనుసంధానించబడి ఉంది.

ఇది ఈ ప్రదేశానికి సమీప అంతర్జాతీయ విమనకేంద్రం. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన రైలుకేంద్రం, ఇది ఈ ప్రాంతాన్ని ఢిల్లీ, వారణాసి, కోల్కతా వంటి ఇతర నగరాలతో కలుపుతుంది. పర్యాటకులు అందుబాటులోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సేవల ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుండి డెహ్రాడూన్ కి రోజువారీ డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

డెహ్రాడూన్ వాతావరణం

డెహ్రాడూన్ లో ఏడాది పొడవునా ఒకమోస్తరు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి ఎత్తుపై ఆధారపడి ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వాతావరణం తేడాగా ఉంటుంది. ఇక్కడ సీతాకాలలు ఆహ్లాదకరంగా ఉంటే, వేసవి చాలా వేడిగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో గడ్డకట్టే శీతాకాలంలో అప్పుడప్పుడు మంచు కురుస్తుంది. పర్యాటకులు అధిక మంచు కురిసే జనవరి సమయంలో తప్ప, మిగిలిన ఏ సమయంలోనైనా దేహ్రాహూన్ కి యాత్ర చేయవచ్చు.

 

డెహ్రాడూన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

డెహ్రాడూన్ వాతావరణం

డెహ్రాడూన్
29oC / 83oF
 • Sunny
 • Wind: NE 8 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం డెహ్రాడూన్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? డెహ్రాడూన్

 • రోడ్డు ప్రయాణం
  డెహ్రాడూన్ ప్రభుత్వ, ప్రైవేట్ వారు నడిపే బస్సుల ద్వారా ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. న్యూ ఢిల్లీ నుండి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రాడూన్ కు రోజువారీ విధానంలో తెల్లవార్లూ డీలక్స్ బస్సులు నడుస్తాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  డెహ్రాడూన్ లోని రైల్వే స్టేషన్ ప్రధాన రైలు కేంద్రం, ఇది కోల్కతా, ఉజ్జయిన్, న్యూ ఢిల్లీ, వారణాసి, ఇండోర్ వంటి భారతదేశంలోని ప్రధాన నగరాలకు రోజువారీ రైళ్ళ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషన్ సిటీ సెంటర్ కు చాలా దగ్గరగా ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  జోల్లీ గ్రాంట్ విమానాశ్రయం డెహ్రాడూన్ లోని సిటీ సెంటర్ నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజువారీ విమానాల ద్వారా కలుపబడి ఉంది. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి కాబ్ లు లేదా టాక్సీల ద్వారా ఈ నగరానికి చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

డెహ్రాడూన్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Apr,Tue
Return On
08 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
07 Apr,Tue
Check Out
08 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
07 Apr,Tue
Return On
08 Apr,Wed
 • Today
  Dehradun
  29 OC
  83 OF
  UV Index: 8
  Sunny
 • Tomorrow
  Dehradun
  20 OC
  68 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Dehradun
  21 OC
  70 OF
  UV Index: 8
  Sunny