Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డెహ్రాడూన్ » వాతావరణం

డెహ్రాడూన్ వాతావరణం

డెహ్రాడూన్ ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం, ఆకురాలు కాలం ఇక్కడి ప్రధాన సీజన్లు.

వేసవి

మార్చ్ నెలలో ప్రారంభమైన వేసవి జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, 17 డిగ్రీలుగా నమోదవుతాయి. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, స్థల సందర్శనకు, ఈ ప్రాంతంలో సాహస క్రీడలు ఆనందించడానికి ఖచ్చిత౦గా ఉంటుంది కనుక ఈ సమయంలో డెహ్రాడూన్ ని సందర్శించవచ్చు.

వర్షాకాలం

ఈ ప్రదేశం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాల సమయంలో ఒక మోస్తరు వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో, ఈ ప్రదేశం పచ్చదనంతో కప్పబడి మరింత అందంగా కనిపిస్తుంది.

చలికాలం

డెహ్రాడూన్ లో శీతాకాలం డిసెంబర్ నెల నుండి ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. శీతాకాలంలో, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా నమోదవుతుంది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో మంచు ఎక్కువగా కురుస్తుంది.