కోరొనేషన్ పార్కు, ఢిల్లీ

హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » కోరొనేషన్ పార్కు

కోరొనేషన్ పార్కు న్యూఢిల్లీ లో నరంకారీ సరోవర్ కి దగ్గర లో బురారీ(భాయీ పరమానంద్) రోడ్డు మీద ఉన్నది. దీనినే కోరొనేషన్ స్మారక చిహ్నం అని కూడా పిలుస్తారు.దీనిలో ఒక పెద్ద ఇసుకరాతి పిల్లర్ ఉంది .ఈ పార్కు లో 1877 లో ఆంగ్లేయులు దర్బారు నిర్వహించి విక్టోరియా రాణీ ని భారత దేశపు రాణీ గా ప్రకటించారు. 1903 లో ఎడ్వర్డ్ V సింహాసనం అధిరోహించినప్పుడు కూడా ఇక్కడే దర్బారు నిర్వహించారు.

1911 లో కింగ్ జార్జ్ కాలం లో ఇక్కడ దర్బారు నిర్వహించి దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీ కి మారుస్తున్నట్లు ప్రకటించి ఈ పార్కు కి శంఖుస్థాపన చేసారు. ఇక్కడ గల పిల్లర్ ఈ సందర్భం లో నిర్మించినదే.

ఈ ఇసుక రాయి పిల్లర్ కి ఎదురుగా కింగ్ జార్జ్ V విగ్రహం,దాని చుట్టూ అనేకమంది ఆంగ్లెయ పాలకుల విగ్రహాలు,మరి కొంతమంది బ్రిటీష్ రాజ్య అధికారుల విగ్రహాలున్నాయి. ఢిల్లీ అభివ్రుద్ధి సంస్థ ఈ పార్కు మరియు అందులో గల విగ్రహాల పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది.

Please Wait while comments are loading...