ఇండియా హాబిటట్ సెంటర్ భారత ప్రభుత్వం చే మొదలు పెట్టబడినది. ప్రభుత్వోద్యోగుల కొరకు ఒక భవనాన్ని నిర్మించాలనే తలపుతో ఈ భవన నిర్మాణం మొదలుపెట్టారు.
ఆ తరువాత ప్రభుత్వం ఇతర స్వచ్చంద సంస్థలని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కొరకు ఆహ్వానించింది. ఫ్రజలకి, మరియు ప్రభుత్వ సంస్థల మధ్య వారధి గా ఉపయోగించుకోవాలని కూడా దీని నిర్మాణం వెనక ఉన్న ఇంకొక ఆలోచన.ఈ సంస్థ సేవలలో కొన్నింటిని సందర్శకులు కూడా ఉపయోగించుకోవచ్చు.
1993 లో దీనిని నిర్మించారు. అనేక సాంస్క్రుతిక , ఆర్ధిక, సామాజిక కార్యక్రమాలకి ఇది ఒక వేదిక. ఇందులోనే ఒక మ్యూజియం,హోటల్సు, రెస్టారెంట్లు, లైబ్రరీ మరియు సభా మంటపాలున్నాయి.



Click it and Unblock the Notifications