సందర్శనకు ఉత్తమ సమయం దేవ్ ఘర్ పర్యటనకు నవంబర్ నుండి మార్చ్ వరకూ ఉత్తమం. అయితే హిందువులకు, జైనులకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అవటం వలన సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తూనే వుంటారు.
వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. కొన్ని మార్లు జూన్ లో కూడా కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుండి గరిష్టం 40 డిగ్రీల వరకూ వుంటాయి.
వర్షాకాలం వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఆకాశం మేఘావృతమై వుంటుంది. వర్షాలు వేసవి వేడి నుండి ఊరట కలిగిస్తాయి. ఈ సమయం లో వాతావరణం తడి, తేమ కలిగి వుంటుంది.
శీతాకాలం శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ వుంటాయి.