Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధనౌల్తి » వాతావరణం

ధనౌల్తి వాతావరణం

ప్రయాణించేందుకు ఉత్తమ సమయం. ఎండాకాలం అలాగే శీతాకాలం ఈ ప్రాంత సందర్శనకు అనువైన సమయాలు. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది.

వేసవి

ఎండాకాలం (ఏప్రిల్ టు జూన్) : ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఎండాకాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్) : జూలై, ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ నెల ల లో అధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అందువల్ల ఈ సమయం ఈ ప్రాంత సందర్శనకు అనువైనది కాదు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ టు ఫిబ్రవరి) : నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫిబ్రవరి నెల ల లో శీతాకాలం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. మంచు కురుస్తుంది.