అంపని, ధరంఘర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూడచక్కని ప్రదేశం. ఫోటోగ్రఫి ప్రియులకు ఎత్తుపల్లాల కొండల చుట్టూ ఉన్న దట్టమైన చిక్కటి అడవులు ఎన్నో అంశాలను అందిస్తాయి. అరుదైన జాతులకు చెందిన వృక్ష, జంతు సంపదతో బాటు కొన్ని గర్జించే జలపాతాలకు కూడా అంపని పుట్టిల్లు. ఈ కొండల మధ్యలో అందంగా ఒదిగిన హలడిగుండి లోయ ఈ పూర్తి ప్రాంతాన్ని ఎంతో అందంగా మారుస్తుంది. నల్ల చిరుత, మచ్చల జింక, సాంబార్ ఉన్న అంబపని అభయారణ్యం కూడా ఇక్కడకు దగ్గరగా ఉంది.
బుధరాజ ఆలయం ఒకటి ఈ దట్టమైన పచ్చటి అడవుల మధ్యలో ఉంది. పర్వతారోహణ ఇక్కడ ప్రసిద్ది చెందిన కార్యకలాపం. ఇది ఒక అందమైన విహారయాత్ర ప్రాంతం. ప్రకృతి మాత ఒడిలో కొంత సమయం గడపాలనుకొనే వారికి అంపని సరైన ఎంపిక. అంపని సందర్శించ దలచిన వారికి అపారమైన అందంతో, గరిష్ట పరిమాణం, పూర్తి బలంతో పై నుండి దుమికే నీటితో కూడిన జలపాతాలు ఉండే వర్షాకాలం ఎంతో అనువైనది.



Click it and Unblock the Notifications