ధరంఘర్ నుండి డొక్రి చంచ్ర 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పచ్చటి అడవుల మడతల నడుమ, గర గర మంటూ కొండల మధ్యలో ప్రవహించే ఒక అల్లరి చిల్లరి జలపాతం. కొండల పై నుండి గర్జిస్తూ, నీరు దూకినట్టుగా కిందకు ప్రవహిస్తూ ఒక సరస్సు లోనికి చేరే ఈ జలపాతం దృశ్యం చూడదగినది. ఈ దృశ్యాన్ని చూడటానికి అనేకమంది వస్తుంటారు. సాహసప్రేమికులు పర్వతారోహణ కోసం ఇక్కడకు వస్తుంటారు. ఏడాది పొడవునా ఈ ప్రాంతం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. కాని విహార యాత్రకు ఇక్కడకు భారీ సంఖ్యలో వచ్చే పర్యాటకులను క్రిస్టియస్ లేదా నూతన సంవత్సరం సందర్భంగా చూడవచ్చు.



Click it and Unblock the Notifications