ధరంఘర్ నుండి 87 కిలోమీటర్ల దూరంలోని ముఖిగూడ కొన్ని అసాధారణ ప్రాకృతిక ప్రాంతాలకు పుట్టిల్లు. ఇది ఇంద్రావతి నది మీద కట్టిన భారతదేశంలోని అతి పెద్ద, ఆసియా ఖండంలోని రెండవ అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన ప్రసిద్ధి చెందిన గొప్ప ఇంద్రావతి ఆనకట్టకు నివాసం. ఈ ఆనకట్ట చుట్టూ వ్యయసాయానికి ఉపయోగించే పచ్చటి పొలాలు ఉంటాయి. ఈ నది తుమల్-రాంపూర్ లో పుట్టి, దట్టమైన పచ్చటి చిక్కనైన అడవులు, మధ్యలోని లోయల గుండా ప్రవహిస్తూ ఖతిగూడ చేరుతుంది.
దట్టమైన పచ్చటి కొండలు, నిర్మలమైన నీలి ఇంద్రావతి నీళ్ళతో కూడిన ఈ ఆనకట్ట ధరంఘర్ సందర్శించే అనేక మంది పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ జలాశయంలో ఉన్న బోటింగ్ సౌకర్యం, పరిసరాల అధ్భుతమైన సౌందర్యం అనేకమంది పర్యాటకులను ఇక్కడి విహారయాత్రకు ఆకర్షిస్తుంది. ఇక్కడకు దగ్గరగా ఉన్న తలగుడ శక్తి పీఠాన్ని ముఖిగూడలోని అతి పురాతన ఆలయంగా పరిగణిస్తారు. ఇది, ధరంఘర్ సందర్శించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం.



Click it and Unblock the Notifications