ధరంఘర్ లో ఉన్న శ్రీ అరబిందో ప్రాచీన చిహ్నాల కేంద్రంలో 2002 ఫిబ్రవరి 4 వ తేదిన స్థాపించిన, శ్రీ మా మాతకు, శ్రీ అరబిందో కు చెందిన పవిత్ర జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ అరబిందో కు చెందిన వెంట్రుకలు, గోళ్ళు ఉన్నాయి. ఈ ప్రాచీన చిహ్నాల కేంద్రంలో శ్రీ మా, శ్రీ అరబిందోల తత్వశాస్త్ర అధ్యయనానికి చెందిన ఒక స్టడీ సెంటర్ లేదా ‘శ్రీ అరబిందో పథచక్ర’ ఉంది. దీనిలో జీవితంలో పరిపూర్ణతను పొందటానికి శ్రీ మా, శ్రీ అరబిందో ల తత్వశాస్త్రాన్ని సమాజానికి బోధి౦చే ఒక విద్యా కేంద్రం కూడా ఉంది.
ఈ ప్రాచీన చిహ్నాల కేంద్రం చుట్టూ చక్కగా నిర్వహిస్తున్న ఒక అందమైన పూలతోట ఉంది. శ్రీ మా ఆశీస్సులు పొందటానికి, దీని దివ్యమైన పరిసరాలలో ధ్యానం చేయడానికి అనేక మంది భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు. ధ్యానం చేయడానికి అనువైన వాతావరణం కోసం ప్రతి ఒక్క మూలలోను గాఢ నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ ప్రాంగణం లోపల ఉన్న ఒక సేల్స్ కార్యాలయం లో శ్రీ అరబిందో బోధనలకు చెందిన అనేక ఉత్పత్తులను కూడా సందర్శకులు కొనుగోలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications