ధరంఘర్ పర్యటనకు వాతావరణం చల్లగా ఉండే సెప్టెంబర్, మార్చి మధ్య కాలం ఎంతో అనువైనది. ఈ కాలంలో రోజంతా వెచ్చటి సూర్యకిరణాలు, చల్లటి గాలులతో ప్రయాణ౦ ఎంతో మనోహరంగా ఉంటుంది. వణికించే వాతావరణం నుండి తమను తాము కాపాడుకోవడానికి పర్యాటకులు తగినన్ని వెచ్చటి దుస్తులను తీసుకుని వెళ్లాలని సూచించబడింది.
వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ వరకు ఉంటుంది. వాతావరణం చాల వేడిగా ఉండటం వలన, ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల గరిష్ట స్థాయికి 33 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరతాయి. స్థిరమైన వేడిగాలులు రోజంతా వీస్తుంటాయి. ధరంఘర్ సందర్శనకు వేసవి అనుకూలమైన కాలం కాదు.
వర్షాలు జూన్ చివర్లో మొదలై ఆగస్టు వరకు ఉంటాయి. సెప్టెంబర్ లో కూడా అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో వరదలు కూడా సంభవిస్తాయి. సెప్టెంబర్ నెలలో జరుపుకొనే నౌఖాయి పండుగ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.
శీతాకాలం సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. పగలు ఎంతో చల్లగా ఉండగా రాత్రిళ్ళు మరింత వణికించే చలితో ఉంటుంది. ప్రజలు మంటల ముందు చలి కాచుకుంటూ వెచ్చదనాన్ని పొందుతారు. అన్ని విహారయాత్ర కేంద్రాలు పర్యాటకులతో నిండిపోతాయి.