Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మశాల » వాతావరణం

ధర్మశాల వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: పర్యాటకులు మార్చ్ నుండి జూన్ వరకు ఉండే వేసవి సమయంలో ధర్మశాలను సందర్శించ వచ్చని సూచన. ఈ సమయంలో పర్వతారోహణ పర్యాటకులకు ప్రసిద్ధ కార్యక్రమం.  

వేసవి

వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): ధర్మశాలలో వేసవి కాలం మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 38, 22 డిగ్రీలుగా నమోదవుతాయి.  

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): ధర్మశాల లో వర్షాకాలం జులై నేలతో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. జులై, ఆగస్ట్ నెలలలో ఇక్కడ అత్యధిక వర్షపాతం ఉంటుంది కావున సందర్శనకు అనుకూలంగా ఉండదు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు): ధర్మశాలలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీలుగా నమోదవుతుంది. ఈ ప్రదేశం జనవరి నెలలో మంచు రూపంలో ఎక్కువ అవపాతంతో ఉండి రోడ్లు దిగ్బంధించబడి ఉంటాయి.