Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిండిగల్ » వాతావరణం

దిండిగల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయంవర్షాకాలం, శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదంగా ఉండడం వల్ల పర్యాటకులకు మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ మాసాల్లో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండడం తో ప్రయాణం సౌకర్యం గా ఉంటుంది. నగరం కూడా వర్షాల ప్రభావం వల్ల తాజాగా, పచ్చగా కనువిందు చేస్తుంది.  

వేసవి

ఎండాకాలం: దక్షిణ భారత ట్రాపికల్ వాతావరణం లో ఉండే దిండిగుల్ లో , ఎండాకాలం వేడిగా , పొడిగా , అధిక తేమ తో ఉంటుంది . మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. ఎండాకాలం లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇది అనువైన సమయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం : జూన్ లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఉష్ణోగ్రత తగ్గు ముఖం పడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇది అనువైన సమయం.

చలికాలం

శీతాకాలం : డిసెంబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వగా కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఇది అనువైన సమయం.