Search
  • Follow NativePlanet
Share

డామన్ మరియు డయ్యు   - ప్రకృతితో సన్నిహితంగా ఉండండి !

54

మీరు శెలవుల్లో అద్భుతమైన సహజ అందాన్ని మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశాలు; డామన్ మరియు డయ్యు, ఇండియా యొక్క కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించాలనుకుంటే, మీరు సరి అయిన ఎంపిక చేసుకున్నారన్న మాట. ఈ జిల్లాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు, 450 సంవత్సరాల క్రితం నుండి పోర్చుగీస్ సంస్కృతితో ఉన్నాయి మరియు డిసెంబర్ 19, 1961 సంవత్సరంలో గోవాతోపాటుగా, వీటిని భారత గణతంత్ర రాజ్యం యొక్క భాగంగా ప్రకటించారు. డామన్ మరియు డయ్యు ప్రారంభ కాలంలో అనేక యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచాయని చరిత్ర చెపుతున్నది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, పోర్చుగీస్ మరియు మరాఠీ ఈ రెండు జిల్లాలలో ప్రధానంగా మాట్లాడే భాషలు.

డామన్ మరియు డయ్యుడామన్ టూరిజం - సంక్షిప్త చరిత్ర

ఇది డామన్ గంగ నదికి ఆనుకుని ఉన్నది. ఈ ప్రశాంతమైన జిల్లా, దాని పరిపూర్ణ సహజ అందం తో, ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నది. ఈ ప్రాంతంలో పలు జాతుల మరియు సంస్కృతుల ప్రజలు కలిసిమెలిసి సామరస్యంగా నివసిస్తున్నారు. డామన్ జిల్లా పోర్చుగీస్ కలోనియల్ ఆర్కిటెక్చర్ తో ఆహ్వానిస్తున్న సముద్ర తీరాలు మరియు చర్చిలకు ఖ్యాతి చెందింది. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని ఇంతకు ముందు రోజుల్లో కలన పావ్రి లేదా లోటస్ ఆఫ్ మార్ష్ లాండ్స్ అని పిలిచేవారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డామన్ ను, డామన్ గంగ నది నాని డామన్ మరియు మోతీ డామన్ అనే రెండు భాగాలుగా విభజిస్తున్నది.

డామన్ - సాంస్కృతిక వైవిధ్యండామన్ టూరిజం యొక్క సాంస్కృతిక ఆకారం గిరిజన, పట్టణ, ఐరోపా మరియు భారతీయ సంప్రదాయాలు పరిపూర్ణ సమ్మేళనంతో ఉన్నది. ఈ జిల్లా గొప్ప వారసత్వాన్ని కలిగిఉన్నది. నృత్యం మరియు సంగీతకళలకు ఈ జిల్లావాసులు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ ప్రదేశంలో అత్యద్భుతమైన అందాన్ని చవిచూస్తూ, డామన్ యొక్క తీరాలలో ఆనందముతో సూర్యుడి-స్నానం చెయ్యవొచ్చు. ఈ ఆహ్లాదకరదృశ్యవీక్షణలే కాకుండా, ఇక్కడ నోరూరించే సముద్ర-ఆహారాన్ని కూడా సందర్శకులు రుచి చూడవొచ్చు.

ఇక్కడ సంవత్సరమంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో, ఈ ప్రదేశానికి సందర్శకులు సంవత్సరంలో ఎప్పుడైనా రావొచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రతలు, అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ నుండి అత్యల్పంగా 11 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేసవిలో కూడా డామన్ లో చల్లటిగాలులు వీస్తాయి. డామన్ దర్శించాలంటే సెప్టెంబర్ ప్రారంభం నుండి మే నెల చివరి వరకు అనుకూలంగా ఉంటుంది.

డామన్ లో మరియు చుట్టూరా ఉన్న పర్యాటక ప్రదేశాలు జామ్పోర్ బీచ్, దేవక బీచ్, బిఒఎం యేసు చర్చ్, వైభవ్ వాటర్ వరల్డ్, సెయింట్ జేరోం ఫోర్ట్, ఇవి డామన్ టూరిజంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు.

డయ్యు టూరిజం - ఒక చరిత్ర రూపం

ఆసక్తికరమైన చరిత్ర మరియు శాంతియుత వాతావరణంతో, డియు జిల్లా, అరేబియా సముద్రంతో చుట్టుముట్టి ఉన్న గుజరాత్ సౌరాష్ట్ర (కతియవాద్) ద్వీపకల్పం యొక్క దక్షిణకొన వద్ద ఉన్నది. డామన్ లాగా, డయ్యు కూడా 1961 వరకు ఒక పోర్చుగీస్ వలసరాజ్యంగా ఉన్నది. డయ్యు కూడా చరిత్రపూర్వ మరియు మధ్యయుగ కాలం నుంచి అనేక రాజ్యాలచేత పాలించబడింది. ఒక ఇరుకైన కాలువ, డయ్యు ద్వీపం మరియు తీరం మధ్య విభజన సృష్టిస్తున్నది. ఈ కేంద్రపాలిత ప్రాంతం, ఇండియాలో అతితక్కువ జనాభా ఉన్న జిల్లాలలో తొమ్మిదవ స్థానంలో ఉన్నది.

డయ్యు వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంతో డయ్యు సందర్శకులకు నిష్కల్మషమైన మరియు రిలాక్స్డ్ స్పాట్ అని నిరూపించబడుతున్నది. ఇక్కడి వాతావరణం సంవత్సరమంతా అనుకూలంగా ఉండటంతో, సందర్శకులు ఎప్పుడైనా దీనిని దర్శించవొచ్చు. డయ్యు బీచులు సందర్శకులతో క్రిక్కిరిసి ఉంటాయి.

డయ్యు-ప్రకాశవంతమైన సంస్కృతి

డయ్యు టూరిజం, కటియావాడి లేదా సౌరాష్ట్ర సంప్రదాయం మరియు పోర్చుగీసు సంస్కృతి కలయికలతో ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నది. ఈ జిల్లా యొక్క నిర్మాణంలో పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది. ఈ జిల్లాలో మతపరంగా ప్రధానంగా హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు ఉన్నారు. అహ్మదాబాద్, రాజ్కోట్, భావ్నగర్ మరియు వడోదర వంటి ప్రధాన నగరాల నుండి డయ్యుకు మంచి రహదారి లింకులు ఉండటంవలన, ఈ ప్రాంతానికి సందర్శకులు సులభంగా చేరుకోవొచ్చు.

డయ్యు లో మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

నాగోవ బీచ్, ఘోగ్ల బీచ్, జలంధర్ బీచ్, గంగేశ్వర్ ఆలయం, సెయింట్ పాల్ యొక్క చర్చి, సీ షెల్ మ్యూజియం, డయ్యు ఫోర్ట్ మొదలైనవి డయ్యు, ప్రసిద్ధ పర్యాటకుల ఆకర్షణలు.

కంటికి ఆహ్లాదం కలిగించే నిర్మాణాలు, ప్రశాంతమైన శుభ్రంగా ఉన్న వాతావరణం, సముద్ర తీరాలు మరియు పరిపూర్ణ వాతావరణంతో కలసి ఉన్న ఆకుపచ్చని పొదలు డామన్ మరియు డయ్యు పర్యటన కొరకు వొచ్చే పర్యాటకులను ఉత్తేజితులను చేస్తున్నాయి.

డయ్యు టూరిజం - డయ్యు టూరిజం లో ఇసుక, సముద్రం మరియు సూర్యుడు

డయ్యు, గుజరాత్ సౌరాష్ట్ర (కతియావాద్) ద్వీపకల్పం యొక్క దక్షిణకొన మీద ఉన్న ఒక చిన్న ద్వీపం. సూర్యుడు, ఇసుక మరియు సముద్రము ఒక అద్భుతమైన సమ్మేళనం, గాలికి నెమ్మదిగా ఊగిసలాడుతున్న పామ్ చెట్లు మరియు ఒడ్డును తాకుతున్న అరేబియన్ సముద్రపు అలలు అన్నీ కలిషి స్వర్గాన్ని తలపింపచేస్తాయి.

 పురాతన మరియు మధ్యయుగ కాలంలో, డయ్యును అనేక రాజులు మరియు రాజవంశాలు పరిపాలించారు. ఇది పోర్చుగీస్ కాలనీగా తయారయ్యింది మరియు గోవాతో కలిసి ఇది 1961లో కేంద్రపాలిత ప్రాంతంగా అయ్యేవరకు అలానే ఉన్నది. ఇది 1987లో గోవా నుండి విభజించబడింది.

డయ్యులో ఉన్న మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఒక మనోహరమైన వాతావరణంలో, సూర్యుడు, ఇసుక మరియు సముద్రంతో దీవింపబడ్డ డయ్యు భారతదేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న బీచ్ ప్రదేశం. బయట జనసమూహాలనుండి దూరంగా, సముద్ర తీరాలు వాటియొక్క సహజమైన నాణ్యతను కలిగి ఉండి మరియు ప్రపంచానంతా వెనుకకు నెట్టి, సంతోషంగా ఉండాలనుకునేవారికి ఆయస్కాంతంలాగా ఆకర్షింపచేస్తున్నాయి మరియు సహజమైన ప్రకృతిఒడిలో సేద తీరుతున్నారు.

నాగోవ బీచ్, ఇది ప్రసిద్ధి చెందిన ఆకర్షణలలో ఒకటి. డయ్యు నుండి 20 నిముషాలలో దీనిని చేరుకోవొచ్చు. ఇది గుర్రపునాడా ఆకారంలో ఉండి, అర్థ-వృత్తాకారంలో ఉన్నది. ఈ బీచ్ లో స్విమ్మింగ్, సైలింగ్,బోటింగ్, వాటర్ స్కైయింగ్ ఇంకా అనేక ఇతర ఉత్సాహం కలిగించే కార్యక్రమాలను చేయవొచ్చు.

ఘోఘ్ల బీచ్, ఇది డయ్యులోని పెద్దది,ప్రశాంతత గలది మరియు అత్యంత అద్భుతమైన సముద్ర తీరాలలో ఒకటి. ఇది ఘోఘ్ల గ్రామం దగ్గర ఉన్నది. ఈ బీచ్, ఈత, పారాసైలింగ్, సర్ఫింగ్ మరియు ఇతర ఉత్తేజకరమైన వాటర్ స్పోర్ట్స్ వంటివాటికి ఆదర్శవంతంగా ఉన్నది.

జలంధర్ బీచ్, డయ్యు నగరానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నది. దీని పేరు ఒక పౌరాణిక రాక్షసుడి పేరునుండి వొచ్చింది. ఈ రాక్షసుడి విగ్రహం సమీపంలోని చిన్నకొండ మీద ఉన్నది. ఈ బీచ్ అందం, శాంతి మరియు ప్రశాంతతతో ఉండి స్వర్గాన్ని తలపింపచేస్తుంది.

డయ్యులో దేవాలయాలు మరియు చర్చులు కూడా అనేకం ఉన్నాయి. ఇంకొక ప్రముఖ ఆకర్షణ శివుడికి అంకితం కావింపబడ్డ గంగేశ్వర్ దేవాలయం. ఇది డయ్యు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాడం గ్రామంలో ఉన్నది. మీరు యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ బోధకుడు అయిన సెయింట్ పాల్ పేరు పెట్టబడిన సెయింట్ పాల్ యొక్క చర్చి దర్శించవొచ్చు మరియు డయ్యులో పురాతన చర్చిలలో ఒకటి అయిన అస్సిసి యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిని కూడా చూడవొచ్చు. 1598లో పోర్చుగీస్ వారిచే నిర్మించబడిన సెయింట్ థామస్ చర్చిని కూడా చూడవొచ్చు.

 డయ్యులోని అనేక ఆసక్తికరమైన సంగ్రహాలయాలలో సీ షెల్ మ్యూజియం ఒకటి. మీరు డయ్యులో ఉన్నప్పుడు మిమ్మలిని ఆకట్టుకునే డయ్యు కోట మరియు దుర్గం,పాణి కోథను కూడా చూడవొచ్చు.

డయ్యు వాతావరణం

డయ్యులో వాతావరణం సంవత్సరమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.

డయ్యు ఎలా చేరుకోవాలి?

డయ్యును విమాన, రైల్ మరియు బస్సు మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.

డయ్యు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

డయ్యు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం డయ్యు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? డయ్యు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం: డయ్యు, వేరవాల్ (90 కిమీ)తో సహా దేశంలోని ప్రధాన జాతీయ రహదారుల గుండా గుజరాత్ మరియు మహారాష్ట్ర రోడ్డు మార్గం ద్వారా కలుపబడి ఉంది. ముంబై, బరోడా, అహ్మదాబాద్, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్, జునాగడ్, వేరవాల్ మొదలైన ప్రధాన నగరాల నుండి గుజరాత్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మరియు ప్రైవేటు లగ్జరీ కోచ్లు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం: డయ్యులో రైల్వే స్టేషన్ లేదు. సమీపంలో వేరవాల్ రైల్వేస్టేషన్ ఉన్నది.ఈ రైల్వే స్టేషన్ రాజ్కోట్, అహ్మదాబాద్, మరియు ముంబై వంటి ప్రధాన నగరాలకు అనుసంధించబడి ఉన్నది. ఇక్కడనుండి డయ్యు చేరుకోవటానికి ప్రైవేటు టాక్సిలు లేదా పబ్లిక్/ప్రైవేటు రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి. దయ్యుకు సమీప రైల్వే స్టేషన్ వేరవాల్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం: సమీపంలో నగోవ విమానాశ్రయం ఉన్నది. ఇది శనివారాలు మినహా అన్ని రోజుల్లో జెట్ ఎయిర్వేస్ డయ్యు-ముంబై రోజువారీ విమాన సేవలు అందిస్తున్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat