Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దొడ్డమకాలి

దొడ్డమకాలి - జాలరుల స్వర్గం

6

దొడ్డమకాలి కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన విహార స్ధలం. పచ్చటి ప్రదేశాల ఆకర్షణ, చక్కటి వాతావరణం ఈ ప్రదేశాన్ని మరోమారు తప్పక సందర్శించేలా పర్యాటకులను చేస్తాయి. ఈ ప్రాంతం భీమేశ్వరి ఫిషింగ్ కేంప్ నుండి ఎగువభాగాన 6 కి.మీ. ల దూరంలో ఉంది. బెంగుళూరుకు 132 కి.మీ. దూరంలో ఉంటుంది.

బెంగుళూరు నగరానికి సమీపం కనుక వారాంతపు సెలవులకు కంపెనీల సిబ్బంది ఎంతో తేలికగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. నగరానికి దూరంగా ఉన్న ప్రశాంత ప్రదేశం కనుక చాలామంది వారాంతపు సెలవులలో ఇక్కడ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇది కావేరీ నదీ తీరంలోని చక్కని విశ్రాంత ప్రదేశం. దొడ్డమకాలి లో వన్యజీవుల సంచారం, పక్షుల గమనం, మరెన్నో ఇతర వినోదాలు ఉంటాయి.

పర్యాటకులు దొడ్డ మకాలి ఎందుకు సందర్శిస్తారు? పక్షుల ప్రియులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. నీటి ఆధారిత పక్షులు అనేక రకాలు ఈ ప్రాంతం సందర్శిస్తాయి. అరుదైన బ్లాక్ బెల్లీడ్ రివర్ టెర్న్, ఓస్ప్రే, గ్రే ఫిష్ ఈగిల్, కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్టలు, మైనాలు, బాతులు, వంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు. దొడ్డమకాలి సుమారుగా 200 పక్షి జాతులకు నిలయంగా ఉంది.

జంతువుల సందర్శనకు ఈ ప్రదేశం ఎంతో బాగుంటుంది. ఎలుగు బంటి సంబార్, మచ్చల జింకలు, ఉడుతలు, చిరుతపులులు, ఏనుగులు, మలబార్ ఉడతలు, గుంట నక్కలు, పాములు మొసళ్ళు, తాబేళ్ళు, ఊసర వెల్లులు ఎన్నో కనపడతాయి.  

మెల్లగా పారుతున్న కావేరి నదీ తీరం దొడ్డమకాలి లో చేపలు పట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతంలో ఎంతో నిరు నిలువ చేయబడి ఉంటుంది. చేపలు పట్టడం, మరల వదిలేయడం పద్ధతిపై ఇక్కడ అనేకమంది ఆనందిస్తూంటారు. మహసీర్ మరియు మరికొన్ని స్ధానిక జాతి చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ప్రాంతంలో గైడ్ సేవలు కూడా లభ్యంగా ఉంటాయి. కనుక చేపలు పట్టటానికి అవసరమయ్యే శిక్షణ కూడా లభిస్తుంది.  

దొడ్డమకాలి గురించి మరింత చెప్పాలంటే....  దొడ్డమకాలి సాహస క్రీడాభిమానులకు మంచి ప్రదేశం. ఈ ప్రాంతంలో నావలు నడపవచ్చు. కయాకింగ్, ర్యాఫ్టింగ్ వంటి ఆటలు కావేరి నదిలో ఆడవచ్చు. పర్వత ప్రదేశ బైకింగ్ మరియు ట్రెక్కింగ్ లు కూడా దొడ్డమకాలిలో సర్వసాధారణ చర్యలుగా భావిస్తారు.  దొడ్డమకాలి సందర్శించే ప్రకృతి ప్రియులు తరచుగా ఈ ప్రదేశంలో నడక సాగిస్తూ అక్కడే ఉన్న పురాతన శివాలయాన్ని సందర్శిస్తారు. దొడ్డమకాలి అడవులలో సోలిగ జాతి తెగల ప్రజలుంటారు. వీరు ఎన్నో శతాబ్దాలనుండి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారు. పర్యాటకులు ఈ స్ధానికులతో సంభంషించి వారి పురాతన నైపుణ్యాలు తెలుసుకుంటారు. దొడ్డమకాలికి దగ్గరలో భీమేశ్వరి ఫిషింగ్ కేంప్, మేకేదాటు జలపాతాలు, సంగం మరియు సింషా జలపాతాలున్నాయి.

బెంగుళూరు నుండి రోడ్డు ప్రయాణంలో దొడ్డమకాలి మూడు గంటలలో చేరవచ్చు. జూలై, ఆగస్టు, ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం. వర్షాకాలం తర్వాత కూడా పచ్చటి ప్రదేశంగా ఉన్నపుడు సందర్శకులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

దొడ్డమకాలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దొడ్డమకాలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దొడ్డమకాలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దొడ్డమకాలి

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - భీమేశ్వరి ఎగువ భాగాన 6 కి.మీ. దూరంలో దొడ్డమకాలి ఉంటుంది. బెంగుళూరు నుండి భీమేశ్వరికి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు ప్రతి దినం లబ్యంగా ఉంటాయి. అక్కడనుండి ట్రెకింగ్ పై దొడ్డమకాలి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - దొడ్డ మకాలిలో రైలు స్టేషన్ లేదు. బెంగుళూరు సిటీ జంక్షన్ దొడ్డ మకాలికి సమీప రైలు స్టేషన్. బెంగుళూరు నుండి భీమేశ్వరి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి దొడ్డమకాలి ప్రాంతానికి ట్రెక్కింగ్ చేయవచ్చు. బెంగుళూరు సిటీ జంక్షన్ నుండి దొడ్డ మకాలి టాక్సీలు, క్యాబ్ లలో తేలికగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    దొడ్డమకాలి ఎలా చేరాలి? విమాన ప్రయాణం - దొడ్డమకాలి భీమేశ్వరి ఎగువ భాగాన 6 కి.మీ. దూరంలో ఉంది. ట్రెక్కింగ్ మార్గంలో ఉంది. భీమేశ్వరికి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఇక్కడినుండి ప్రపంచంలోని అన్ని దేశాలకు విమానాలు నడుస్తాయి. ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలనుండి వచ్చే పర్యాటకులు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టాక్సీలు, క్యాబ్ లలో దొడ్డమకాలి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City