జొంగు దాని యాలుకల తోటలకు ప్రసిద్ధి చెందింది. సిక్కింలోని జొంగు అంతగా అన్వేషించని ప్రాంతమైనందున, ఈ ప్రాంతం దట్టమైన అడవులతో, యాలుకల తోటలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు యాలుకల సాగుకు ఖచ్చితంగా సరిపోతాయి. వాటి సాగులో ఇమిడి ఉన్న నిజమేమిటంటే ఇవి ఏ...
తోలుంగ్ మఠం, జొంగు దగ్గరగా పాసింగ్ డాన్ కు కొంత దూరంలో ఉంది. ఇది ఒక పురాతన ధార్మిక ప్రార్ధనా ప్రాంతం. ప్రతిమూడేళ్ళకొకసారి, తోలుంగ్ గొంపలోని తోలుంగ్ మఠం కంసెల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానిలో గొంపలోని సంపదను ప్రదర్శిస్తారు. ఈ ఆచారాన్ని సేకరణలను...
హీ గ్యతాంగ్, దిగువ జొంగు ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం. ఇది ఉత్తర సిక్కిం జిల్లాలోని మంగన్ ఉపవిభాగంలోని ప్రాంతం. ఇక్కడ ఉన్న ఒక సరస్సును లెప్చా సమాజానికి చెందిన ప్రజలు పవిత్రమైనదిగా పరిగణించి, పూజిస్తారు.
సాంప్రదాయ లెప్చా హౌస్ మ్యూజియం, ఒక సంప్రదాయ శైలిలో నిర్మించిన ఒక లెప్చా ఇంటి నమూనా. తీస్తా నది, రోంగ్యుంగ్ చు నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఈ భవనంలో ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం చుట్టూ ఉన్న వాతావరణం విభిన్న సీతాకోకచిలుకలను చూడటానికి ఒక ఉత్తమ ప్రాంతం కూడా.
పెంతోంగ్, ఉత్తర సిక్కింలోని మంగన్ ఉపవిభాగంలో జొంగుకు దగ్గరగా ఉన్న ఒక గ్రామం. పర్యాటకులు, దీని పరిసరాలలో ఉన్న మంచుతో కప్పిన పర్వతాల దగ్గరి అద్భుతదృశ్యాలను చూడటానికి ఈ ప్రాంతానికి రావచ్చు. ఈ ప్రాంతాన్ని పర్వతారోహణ ద్వారా చేరవచ్చు.
జొంగు చుట్టుపక్కల ఒక దానిని మించి మరొకటి ఉన్న అనేక జలపాతాలు ఉన్నాయి. వీనిలో, లింగ్జ్య జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. మనం ఈ జలపాతాన్ని సందర్శించి, స్నానంచేసి, కొన్ని గంటలు విశ్రాంతిగా సేదతీరవచ్చు.
కేశోంగ్, పూర్తి జొంగు ప్రాంతంలోనే బహుశ ఎంతో అందమైన ప్రదేశం. ఇది బాగా దగ్గరగా ఉన్న ఎంతో సుందర దృశ్యాల ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టూ అందమైన చక్కటి కొండలలో స్వచ్ఛమైన, ఆకర్షించే సరస్సు కూడా ఇమిడి ఉంది. సరైన సమయంలో పర్యటించినప్పుడు, ఈ లోయ అందమైన పుష్పాల దుప్పటి కప్పుకొని...
జొంగులో పర్వతారోహణ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. కారణం: ఈ ప్రాంతం అన్వేషించబడలేదు. పర్వతారోహకులు, ఎన్నో తెలియని కాలువలు, అడవులు గుండా వస్తారు. ఈ ప్రశాంతమైన పట్టణంలో చిన్న, పెద్ద అధిరోహణలను కూడా ప్రణాళికలో పొందుపరుచుకోవచ్చు.
చేపలు పట్టడం ఇష్టమా? జొంగులో ప్రయత్నించండి. ఇది ఇతర చేపలు పట్టడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లాగా సులువుగా అనిపించక పోవచ్చు. కాని ఓపికగా చేస్తే, నిజానికి ఇది ఒక అందమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి నదులలో మహ్సీర్, ట్రౌట్ సాధారణంగా కనిపిస్తాయి.
జొంగులో ఉన్నప్పుడు, లింగ్తెం ను సందర్శించండి – పాసింగ్ డాంగ్ గ్రామం నుండి మీరు అధిరోహించవలసిన ప్రదేశం. చిన్న అధిరోహణ అయినప్పటికీ, ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడకి చేరిన తర్వాత, జొంగు లోయ, కంచనజంగా పర్వతాల దృశ్యాలను చూసి మనం ఆనందించవచ్చు.